రఘువంశీ, రింకూ మెరుపులు.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్‌ | IPL 2026, Rinku Singh And Angkrish Raghuvanshi Power KKR To Strong 192 Against RCB In Rain Delayed Clash, Check Story Inside | Sakshi
Sakshi News home page

IPL 2026: రఘువంశీ, రింకూ మెరుపులు.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్‌

May 13 2026 10:29 PM | Updated on May 14 2026 11:43 AM

IPL 2026: Rinku Singh, Angkrish Raghuvanshi take KKR to 192

ఐపీఎల్‌-2026లో రాయ్‌పూర్ వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాట‌ర్లు దుమ్ములేపారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 192 ప‌రుగులు చేసింది. పిచ్‌ కాస్త నెమ్మ‌దిగా ఉన్న‌ప్ప‌టికి కోల్‌క‌తా బ్యాట‌ర్లు అద్భుతమైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు. 

కేకేఆర్ ఇన్నింగ్స్‌లో యువ ఆట‌గాడు అంగక్రిష్ రఘువంశీ(71) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. రింకూ సింగ్‌( 29 బంతుల్లో 49), గ్రీన్‌(32) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, రాసిఖ్ సలామ్ దార్ తలా వికెట్‌ సాధించారు. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ 8:45 గంటలకు ప్రారంభమైంది.

తుది జ‌ట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే (కెప్టెన్‌), ఫిన్ అలెన్, కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీప‌ర్‌), రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండే, రింకు సింగ్, సునీల్ నరైన్, అనుకూల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్(కెప్టెన్‌), జితేష్ శర్మ(వికెట్ కీప‌ర్‌), టిమ్ డేవిడ్, వెంకటేష్ అయ్యర్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రసిఖ్ సలాం దార్, జాకబ్ డఫీ, జోష్ హాజిల్‌వుడ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement