రాజస్తాన్‌పై గ్రాండ్‌ విక్టరీ.. ఢిల్లీ ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవం | Delhi Capitals Crush Rajasthan Royals Playoff Hopes With Thrilling 5 Wicket Win And Stay Alive In Playoff Race | Sakshi
Sakshi News home page

IPL 2026: రాజస్తాన్‌పై గ్రాండ్‌ విక్టరీ.. ఢిల్లీ ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవం

May 17 2026 11:37 PM | Updated on May 18 2026 10:46 AM

Delhi Capitals Dent Rajasthan Royals Playoff Hopes With 5-Wicket Win

ఐపీఎల్‌-2026లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. రాజస్తాన్ విధించిన 194 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.2 ఓవర్లలో చేధించింది.

ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్‌(56), అభిషేక్ పోరెల్‌(51) హాఫ్ సెంచరీలతో రాణించగా.. అక్షర్ పటేల్‌(34), అశుతోష్‌ శర్మ(18) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. రాజస్తాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌, బ్రిజేష్‌ శర్మ రెండు వికెట్లు పడగొట్టగా.. షనక ఓ వికెట్‌ సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఓ దశలో 200కు పైగా పరుగులు సాధించేలా కన్పించిన రాజస్తాన్.. ఆఖరిలో మాత్రం తడబడింది.

రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో ధ్రువ్‌ జురెల్‌(53), రియాన్‌ పరాగ్‌(51) హాఫ్‌ సెంచరీలతో సత్తాచాటగా.. వైభవ్‌ సూర్యవంశీ(21 బంతుల్లో 46) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ నాలుగు వికెట్లు, ఎంగిడీ, మాధవ్‌ తివారీ తలా రెండు వికెట్లు సాధించారు. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ పాయిం‍ట్ల పట్టికలో ఏడో స్ధానానికి చేరుకుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement