వరుస వైఫల్యాల తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంళూరు (ఆర్సీబీ) దిగ్గజం విరాట్ కోహ్లి బుధవారం బ్యాట్ ఝులిపించాడు. ‘వింటేజ్ కింగ్’ను గుర్తుచేస్తూ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)పై శతక్కొట్టాడు. ప్రత్యర్థి విధించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నిలకడైన ఆట తీరుతో ఆకట్టుకుని జట్టును గెలిపించాడు.
గెలుపులో కీలక పాత్ర
రాయ్‌పూర్ వేదికగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో మొత్తంగా 60 బంతుల్లో.. 105 పరుగులతో కోహ్లి (Virat Kohli) అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఆర్సీబీ గెలుపులో కీలక పాత్ర పోషించిన కోహ్లిని ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించింది.
అది నన్ను తీవ్రంగా వేధించింది
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘గత రెండు మ్యాచ్‌లలో నేను పరుగులు చేయలేకపోయాను. అది నన్ను తీవ్రంగా వేధించింది. బాగా ఆడగలనని నాకు తెలుసు. ఈరోజు బంతిని బలంగా బాది అనుకున్నట్లుగా పని పూర్తి చేశాను.
రోజురోజుకీ మరింత మెరుగ్గా ఆడటమే లక్ష్యం. అయితే, కొన్నిసార్లు వైఫల్యాలు ఎదురవుతాయి. వాటిని తేలికగా తీసుకోకూడదు. ఒత్తిడిని జయించి ముందుకు సాగాలి. ఒక్కోసారి ఒత్తిడిలో ఆడటం కూడా మంచిదే.
Cometh the hour, cometh KING KOHLI! 👑
The chase master. The run machine and we are running out of superlatives.
Century No. 9️⃣ for #ViratKohli in TATA IPL! ❤️🌟
[ #TATAIPL, #RCBvsKKR, #ManishPandey, #ViratKohli, #Narine, #RinkuSingh ] pic.twitter.com/BT9CGj4y7K— Star Sports (@StarSportsIndia) May 13, 2026
కారణం అదే
అదే మనల్ని మరింత కఠినంగా శ్రమించేలా చేస్తుంది. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు తొలి అడుగు పడేలా ముందకు తోస్తుంది. గత రెండు మ్యాచ్‌లలో విఫలమైనప్పుడు నేను నిరాశ చెందిన మాట వాస్తవం. ఈరోజు సెంచరీ పూర్తైన తర్వాత గొప్పగా సంబరాలు చేసుకోకపోవడానికి కారణం అదే.
కృతజ్ఞుడిగా ఉంటాను
నా దృష్టి మొత్తం వీలైనన్ని ఎక్కువగా పరుగులు రాబట్టి జట్టును గెలిపించడమే. బ్యాటింగ్ చేయడమంటే నాకు ఇష్టం. ఎన్ని రికార్డులు బద్దలు కొట్టినా నాలో పరుగుల దాహం తీరదు. మళ్లీ మొదటి నుంచి వచ్చినట్లుగానే ఉంటుంది. ఆట కోసం ప్రాణం పెడతా.
దేవుడి దయ వల్ల ఎన్నో రికార్డులు సాధించగలిగాను. అందుకు నేను కృతజ్ఞుడిగా ఉంటాను’’ అని విరాట్ కోహ్లి ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు. కాగా ఐపీఎల్‌లో కోహ్లికి ఇది తొమ్మిదో సెంచరీ కాగా.. ఓవరాల్‌గా టీ20 ఫార్మాట్లో పదవ శతకం. ఇదిలా ఉంటే.. గత రెండు మ్యాచ్‌లలో కోహ్లి డకౌట్ అయిన సంగతి తెలిసిందే.
చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. సరికొత్త చరిత్ర


