పంజాబ్‌పై ఆర్సీబీ గెలుపు
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మే 17) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ 23 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో ఆ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.
విరాట్ కోహ్లి (58), వెంకటేశ్ అయ్యర్ (73 నాటౌట్) మెరుపు అర్ద శతకాలతో చెలరేగారు. పడిక్కల్ (45), టిమ్ డేవిడ్ (28) కూడా బ్యాట్ ఝులిపించారు. జేకబ్ బేతెల్ (11) పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్ 2 వికెట్లు తీయగా.. అర్షదీప్ సింగ్, చహల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. ఈ ఓటమితో ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ సీజన్ తొలి 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించిన పంజాబ్.. ఆతర్వాతి 6 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, నిష్క్రమణ అంచుల్లో నిలిచింది.
ఆర్సీబీతో మ్యాచ్‌లో పంజాబ్ ఆదిలోనే పట్టు కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ ధాటికి ఆ జట్టు 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆతర్వాత కూపర్ కన్నోల్లీ (37), సూర్యాంశ్ షేడ్గే (35) కాసేపు క్రీజ్‌లో నిలదొక్కుకున్నారు. అయితే షెపర్డ్, సుయాశ్ శర్మ దెబ్బకు వీరిద్దరు ఔటయ్యారు. ఈ దశలో శశాంక్ సింగ్ (56), స్టోయినిస్ (37) పంజాబ్ శిబిరంలో ఆశలు రేకెత్తించారు.
వీరు కూడా ఔట్ కావడంతో పంజాబ్ ఓటమి ఖరారైంది. ఆర్సీబీ బౌలర్లలో రసిక్ సలాం దార్ 3, భువీ 2, హాజిల్‌వుడ్, సుయాశ్ శర్మ, షెపర్డ్ తలో వికెట్ తీశారు. పంజాబ్ బ్యాటర్లలో ప్రియాంశ్ ఆర్య 0, ప్రభ్‌సిమ్రన్ 2, శ్రేయస్ 1, ఒమర్‌జాయ్ 14 పరుగులకు ఔటయ్యారు.
93 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన పంజాబ్
223 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ దాదాపుగా చేతులెత్తేసింది. 93 పరుగులకే ఆ జట్టు సగం వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతోంది. స్టోయినిస్ (14), శశాంక్‌సింగ్ (0) క్రీజ్‌లో ఉన్నారు.
పీకల్లోతు కష్టాల్లో పంజాబ్
223 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ తడబడుతోంది. 19 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. భువనేశ్వర్ కుమార్ (2-0-8-2) అద్భుతమై స్వింగ్ బౌలింగ్‌తో పంజాబ్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు.
అతనికి రసిక్ సలామ్ దార్ (1-0-4-1) తోడయ్యాడు. పంజాబ్ బ్యాటర్లలో ప్రియాంశ్ ఆర్య డకౌట్ కాగా.. ప్రభ్‌సిమ్రన్ సింగ్ 2, శ్రేయస్ అయ్యర్ ఒక్క పరుగుకు వెనుదిరిగారు. కూపర్ కన్నోలీ (15), సూర్యంశ్ షేడ్గే (4) క్రీజ్‌లో ఉన్నారు.
పంజాబ్ రెండో వికెట్ డౌన్
పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రెండు ఓవర్లకు పంజాబ్ స్కోర్: 19/2
పంజాబ్ తొలి వికెట్ డౌన్
223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య ఖాతా తెరవకుండానే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
ఆర్సీబీ భారీ స్కోర్
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (58), వెంకటేశ్ అయ్యర్ (73 నాటౌట్) మెరుపు అర్ద శతకాలతో చెలరేగారు. పడిక్కల్ (45), టిమ్ డేవిడ్ (28) కూడా బ్యాట్ ఝులిపించారు. జేకబ్ బేతెల్ (11) పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్ 2 వికెట్లు తీయగా.. అర్షదీప్ సింగ్, చహల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
14.6వ ఓవర్- 157 పరుగుల వద్ద ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. చహల్ బౌలింగ్‌లో ప్రియాంశ్ ఆర్యకు క్యాచ్ ఇచ్చి విరాట్ కోహ్లి (58) ఔటయ్యాడు.
రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
9.1వ ఓవర్- 97 పరుగుల వద్ద దేవ్‌దత్ పడిక్కల్ (45) ఔటయ్యాడు. హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
ధాటిగా ఆడుతున్న పడిక్కల్, కోహ్లి
విరాట్ కోహ్లి (24), దేవ్‌దత్ పడిక్కల్ (23) ధాటిగా ఆడుతున్నారు. 6 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 61-1గా ఉంది.
తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
2.2వ ఓవర్- 21 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్లో జేకబ్ బేతెల్ (11) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్
ఐపీఎల్ 2026లో ఇవాళ (మే 17) డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లో ఆర్సీబీ, పంజాబ్ తలపడుతున్నాయి. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ గాయం కారణంగా దూరమయ్యాడు. అతని స్థానంలో జితేశ్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు.
తుది జట్లు..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, వెంకటేష్ అయ్యర్, జితేష్ శర్మ(w/c), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, క్రునాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్(w), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(c), సూర్యాంశ్ షెడ్గే, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్, లాకీ ఫెర్గూసన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్


