‘న‌న్ను పావుగా వాడుకొని కోహ్లీపై కుట్ర పన్నాగం’ | Model Liz Laz Claims Journalists Offered Money To Defame Virat Kohli, Denies Allegations Against Star Cricketer | Sakshi
Sakshi News home page

‘న‌న్ను పావుగా వాడుకొని కోహ్లీపై కుట్ర ప‌న్నాగం’: జర్మన్‌ మోడల్‌ లిజ్‌ లాజ్‌

May 13 2026 7:14 AM | Updated on May 13 2026 10:43 AM

LizLaz Drops Bombshell-Offered-Money To Speak Negatively About-Kohli

జ‌ర్మ‌న్ మోడ‌ల్, ఇన్‌ఫ్లుయెన్స‌ర్ లిజ్‌లాజ్ పెట్టిన పోస్టుకు టీమిండియా స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ లైక్ కొట్ట‌డం సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అయింది. ఆ త‌ర్వాత ఆ లైక్ క‌నిపించ‌క‌పోవ‌డం వివాదంగా మారింది. ఈ నేప‌థ్యంలో లిజ్ లాజ్ మ‌రోసారి బాంబు పేల్చింది. కోహ్లీపై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేయాలంటూ కొంద‌రు జ‌ర్న‌లిస్టులు త‌న‌ను సంప్ర‌దించార‌ని, అందుకు భారీగా డ‌బ్బులు కూడా ఆఫ‌ర్ చేశార‌ని లిజ్ లాజ్ వెల్ల‌డించింది. 

తనను పావులా వాడుకొని కోహ్లీపై కుట్ర పన్నాలని భావించారని, కానీ డ‌బ్బు కోసం లేదా పాపుల‌ర్ అవ్వ‌డానికి కోహ్లీ పేరును వాడుకొని అత‌డి ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీయాల‌న్న ఆస‌క్తి త‌న‌కు లేద‌ని తెలిపింది. అందుకే వాళ్లు (జ‌ర్న‌లిస్టులు) ఇచ్చిన ఆఫ‌ర్‌ను సున్నితంగా తిర‌స్క‌రించిన‌ట్లు పేర్కొంది. ఇంట‌ర్వ్యూలో లిజ్ లాజ్ మాట్లాడుతూ.. ‘మొదట విరాట్ కోహ్లీ నా ఫొటో లైక్ చేసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ప్రపంచస్థాయి క్రికెటర్ నా పోస్టును గమనించడం గర్వంగా అనిపించింది. 

కానీ తర్వాత ఆ విషయాన్ని సోషల్ మీడియాలో అతిగా చూపించడం బాధ కలిగించింది. ఒక సాధారణ సోషల్ మీడియా యాక్టివిటీని పెద్ద వివాదంగా మార్చడం సరికాదు. కోహ్లీపై వచ్చిన ట్రోలింగ్ చూసి ఆశ్చర్యపోయాను. అతను ఎప్పుడూ అనుచితంగా ప్రవర్తించలేదు. కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి మాట్లాడుతూ, అత‌డిని ఫుట్‌బాల్ దిగ్గజాలు మెస్సీ, రొనాల్డోల‌తో పోల్చింది. 

‘కోహ్లీ ఆసియాలో అత్యంత ప్రభావవంతమైన క్రీడాకారుల్లో ఒకరు. ఆయనపై అనవసర ఆరోపణలు చేయడం సరైంది కాదు. ఒక చిన్న విషయాన్ని పెద్ద వివాదంగా మార్చి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూడటం బాధాకరం’ అని ఆమె పేర్కొంది. ఈ వివాదం తర్వాత భారత్‌లో లిజ్ లాజ్‌కు విపరీతమైన గుర్తింపు వచ్చినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్లు భారీగా పెరిగారు. 

పలు బ్రాండ్ ప్రమోషన్లు, రియాలిటీ షో అవకాశాలు కూడా వచ్చినట్లు సమాచారం. అయినప్పటికీ, తాను సంచలన ప్రచారం కోసం ఎవరి ప్రతిష్ఠతో ఆడుకోనని ఆమె స్పష్టం చేసింది. అంతేకాదు తాను ఐపీఎల్‌కు పెద్ద అభిమానినని, ముఖ్యంగా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ) జట్టును క్ర‌మం త‌ప్ప‌కుండా ఫాలో అవుతానని స్ప‌ష్టం చేసింది.

ఎవ‌రీ లిజ్‌లాజ్?
లిజ్ లాజ్‌ దక్షిణాఫ్రికాలో జ‌న్మించింది. ఆమె తండ్రిది సౌతాఫ్రికా కాగా.. త‌ల్లిది జ‌ర్మ‌నీ. దీంతో లిజ్ లాజ్ జర్మన్, ఆఫ్రికా, డచ్, ఫ్రెంచ్, రష్యన్ వంటి భాషలను అనర్గళంగా మాట్లాడగలదు. సైకాల‌జీ విభాగంలో ఎంఎస్సీ ప‌ట్టా పొందింది. లైఫ్‌సేవింగ్ స్విమ్మర్ కూడా లిజ్ లాజ్ గుర్తింపు పొందింది. ఫుడ్ వ్లాగింగ్, ట్రావెలింగ్‌, పాటల రచన లిజ్ లాజ్ హాబీలు.

చదవండి: చీర్‌గ‌ర్ల్స్ చిందులు.. క‌ళ్ల‌ప్ప‌గించిన‌ పోలీసులు!    

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement