ఏడీఎఫ్.. మహోన్నతం
యద్దల వెంకటసుబ్బారెడ్డికి నివాళులు
గూడూరు రూరల్: మండలంలోని మంగళపూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత యద్దల నరేంద్రరెడ్డి తండ్రి యద్దల వెంకటసుబ్బారెడ్డి ఉత్తరక్రియలను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటసుబ్బారెడ్డి చిత్రపటానికి మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పుష్పాంజలి ఘటించారు. ఎమ్మెల్సీ, గూడూరు నియోజకవర్గ ఇన్‌చార్జి మేరిగ మురళీధర్, సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, ఎస్‌ఈసీ సభ్యుడు కుమారస్వామిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు మెట్టా రాధాకృష్ణారెడ్డి, కోడూరు మీరారెడ్డి, కల్పలత, గూడూరు పట్టణ, రూరల్, చిల్లకూరు మండల కన్వీనర్లు బొమ్మిడి శ్రీనివాసులు, మల్లు విజయకుమార్‌రెడ్డి, భక్తవత్సలరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, సుబ్రహ్మణ్యంరెడ్డి, మనపాటి రవీంద్రబాబు, యోగి, సుబ్బారావు, గూడూరు ఎంపీపీ గురవయ్య, యువజన విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండూరు సునీల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు: ఆత్మకూరు నియోజకవర్గాభివృద్ధికి ఏడీఎఫ్ ఎనలేని కృషి చేస్తోంది. ఇందులో భాగంగా తన కుటుంబసభ్యులతో అప్పటి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి మాట్లాడి.. అందరికీ ఆదర్శంగా నిలిచేలా తొలుత రూ.10 కోట్లను దీని కోసం కేటాయించారు. గ్రామాల అభివృద్ధి విషయంలో ప్రభుత్వంపై ఆధారపడకుండా కలిసొచ్చిన దాతలను కలుపుకొని పనులు చేసేలా ప్రణాళికలను రూపొందించారు.
అభివృద్ధి పరవళ్లు..
తన సోదరుడు, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆశయ సాధనలో భాగంగా ఆత్మకూరులో రూ.4.5 కోట్లతో మున్సిపల్ బస్టాండ్‌ను నిర్మించారు. ఏడీఎఫ్ రూపకల్పన, ఆలోచన శైలి, అభివృద్ధి పనుల్లో నిజాయతీని పరిశీలించిన పలువురు భాగస్వాములయ్యేందుకు ముందుకొచ్చారు. దీంతో ఏడీఎఫ్ బెంగళూరు చాప్టర్‌ను ఆవిష్కరించారు. ఆత్మకూరు ప్రాంతానికి చెంది కర్ణాటకలోని పలువురు తమ ప్రాంత అభివృద్ధి కోసం దీన్ని వేదికగా చేసుకునేందుకు ముందుకొచ్చారు. పుట్టిన ఊరిపై మమకారంతో ఆర్థిక స్థితిమంతులు, వ్యాపారవేత్తలు, ఉన్నత స్థాయి ఉద్యోగులు.. మేకపాటి విక్రమ్‌రెడ్డి వెంట నడిచేందుకు సిద్ధమయ్యారు.
డిజిటల్ తరగతి ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడుతున్న విక్రమ్‌రెడ్డి (ఫైల్)
ఏడీఎఫ్ నిధులతో నిర్మించిన మున్సిపల్ బస్టాండ్
చేపట్టిన కార్యక్రమాలివీ..
సోమశిలలోని సోమేశ్వరాలయ పునరుద్ధరణకు రూ.50 లక్షలను అందజేశారు.
పలు ప్రముఖ కంపెనీలతో జాబ్ మేళాలను రెండుసార్లు నిర్వహించి 2250 మందికి ఉద్యోగావకాశాలను కల్పించారు.
హసనాపురం – కలిగిరి రోడ్డు మరమ్మతు పనులకు రూ.నాలుగు లక్షలను వెచ్చించారు.
గ్రూప్ – 2 పరీక్షలు రాసే వారికి రూ.నాలుగు లక్షల విలువజేసే మెటీరియల్‌ను పంపిణీ చేశారు.
నియోజకవర్గంలోని 31 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు రూ.60 లక్షల వ్యయంతో డిజిటల్ తరగతులను ఏర్పాటు చేశారు.
మర్రిపాడు మండలంలోని చాబోలు విద్యార్థుల కోసం స్కూల్ బస్సు ఏర్పాటుతో పాటు అనంతసాగరం పంచాయతీ బస్టాండ్‌ను నిర్మించారు.
108 వాహన ఉద్యోగులకు గది ఏర్పాటు.. సంగం, ఆదూరుపల్లి, ఆత్మకూరు, అన్నారెడ్డిపాళెం, నందవరం, కంపసముద్రం, ఏఎస్‌పేట ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, ఏఎస్‌పేట కేజీబీవీలో ఇన్వర్టర్లను సమకూర్చారు.
అలింకో సంస్థ సహకారంతో రూ.21.1 లక్షల వ్యయంతో 170 మంది దివ్యాంగులకు అవసరమైన పరికరాలను పంపిణీ చేశారు.
రూ.ఆరు లక్షలతో పలువురికి మోకాలి శస్త్రచికిత్సలు.. మర్రిపాడు మండలంలోని సింగనపల్లి, బాట, కంపసముద్రం గ్రామాల్లో రూ.ఎనిమిది లక్షల వ్యయంతో మూడు వాటర్ ప్లాంట్ల ఏర్పాటు.. ఇలా ఎన్నింటినో కల్పించారు.
ఆత్మకూరులో విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు
ఐదో వసంతంలోకి అడుగిడుతూ..
మాజీ ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి మాననపుత్రిక
ప్రభుత్వ పాఠశాలలు, గ్రామాల్లో
పలు సౌకర్యాలు
రూ.4.5 కోట్లతో
మున్సిపల్ బస్టాండ్ ఏర్పాటు
ఆత్మకూరు నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఎన్నో చర్యలు చేపట్టారు. అంతా సజావుగా సాగుతున్న తరుణంలో 2022లో ఆయన హఠాన్మరణం చెందారు. ఈ తరుణంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టి అదే ఏడాదిలో నిర్వహించిన ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి ఘన విజయం సాధించారు. శోకసంద్రంలో ఉన్న తన కుటుంబాన్ని ఆదరించి పట్టంకట్టిన ప్రజానీకానికి తన వంతు సేవ చేయాలనే మహోన్నత ఆశయంతో ఆత్మకూరు డెవలప్‌మెంట్ ఫోరం (ఏడీఎఫ్) ఏర్పాటుకు ఆయన సంకల్పించారు. ప్రభుత్వంపై ఆధారపడకుండా దాతల సహకారం, తన వంతు భాగస్వామ్యంతో 2022, డిసెంబర్ పదిన దీనికి శ్రీకారం చుట్టారు. నాటి నుంచి నేటి వరకు మౌలిక వసతులను కల్పిస్తూ.. అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ ప్రజా సంక్షేమమే తన పరమావధి అని చాటి చెప్తున్నారు.
ఏడీఎఫ్.. మహోన్నతం
ఏడీఎఫ్.. మహోన్నతం
ఏడీఎఫ్.. మహోన్నతం


