సమ్మె విజయవంతానికి పిలుపు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలంటూ ఫిబ్రవరి 12వ తేదీన జరిగే సమ్మెను విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. నెల్లూరులోని సీఐటీయూ కార్యాలయంలో బుధవారం ట్రేడ్ యూనియన్లు, రైతు, వ్యవసాయ, కౌలు రైతు సంఘాల నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాలుగు లేబర్ కోడ్స్‌ను అమల్లోకి తీసుకురావడంతో కార్మిక, ఉద్యోగ వర్గాలకు కనీస వేతనం అందే పరిస్థితి లేదన్నారు. వచ్చే నెల 3వ తేదీన టౌన్‌హాల్లో జిల్లా సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో నేతలు టీవీవీ ప్రసాద్, శంకర్ కిషోర్, వెంగయ్య, అజయ్‌కుమార్, గోగుల శ్రీనివాసులు, యానాదయ్య, రాంబాబు, బసవరాజు, షాన్‌వాజ్, రెహానా బేగం, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


