విద్యాసాగర్ ప్యానల్‌కే మద్దతు
నెల్లూరు(అర్బన్): వచ్చే నెల 8వతేదీన జరిగే ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పోటీ చేస్తున్న అలపర్తి విద్యాసాగర్, డీవీ రమణ ప్యానల్‌కే జిల్లా సంఘం తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశామని ఆ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బండారుపల్లి వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం దర్గామిట్టలోని ఎన్జీఓ భవన్‌లో ఆ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యాసాగర్ ఆధ్వర్యంలోనే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పోరాటాలు నిబద్ధతతో జరుగుతున్నాయన్నారు. అనంతరం ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో నేతలు గాదిరాజు రామకృష్ణ, ఆంజనేయవర్మ, లక్కాకుల పెంచలయ్య, కిరణ్‌ప్రసాద్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్, సతీష్, సురేష్, రాజేంద్ర, రవికుమార్, రమ్య, కరుణమ్మ తదితరులు పాల్గొన్నారు.


