బంగారు గొలుసు అపహరణ | - | Sakshi
Sakshi News home page

బంగారు గొలుసు అపహరణ

Jan 30 2026 6:53 AM | Updated on Jan 30 2026 6:53 AM

బంగారు గొలుసు అపహరణ

బంగారు గొలుసు అపహరణ

పొదలకూరు: మండలంలోని విరువూరు గ్రామం జొన్నమిట్ట కాలనీకి చెందిన మహిళ మెడలో బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తి గురువారం అపహరించుకెళ్లారు. ఎస్సై హనీఫ్‌ కథనం మేరకు.. సుదర్శనమ్మ కాలినడకన పొలాల మీదుగా కాలనీ నుంచి విరువూరు గ్రామంలోని తన కుమార్తె వద్దకు వెళ్తోంది. దుండగుడు కాపుకాచి 4 సవర్ల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

విద్యార్థి ఆత్మహత్య

కావలి(దగదర్తి): కావలి పట్టణం వెంగయ్యగారిపాళేనికి చెందిన ఓ విద్యార్థి గురువారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. వినాయకస్వామి దేవస్థానం వద్ద నివాసముంటున్న రాజవరపు చంద్రహాసన్‌ (19) బీసీఏ చదువుతున్నాడు. అతను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న కావలి ఒకటో పట్టణ సీఐ ఫిరోజ్‌ మృతుడి నివాసానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement