ప్రతిపక్షంపై శ్రద్ధ.. నేరాలను అరికట్టడంపై పెట్టండి
●
జిల్లాలో పోలీస్ యంత్రాంగం నిర్వీర్యమైపోయింది. ప్రతిపక్ష నేతల ఇళ్లపై వీరి కళ్ల ముందే దాడులు చేస్తున్నా.. చూస్తున్నారు. తిరిగి బాధితులపైనే కేసులు నమోదు చేస్తున్నారు. అధికార పార్టీ నేతల అవినీతి, దాష్టీకాలపై ప్రెస్‌మీట్లు పెడితే.. కేసులు పెడతారు. ప్రభుత్వ అసమర్థను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారు. తమ పార్టీ నేతలు చేసే ఉద్యమాలను అడ్డుకునేందుకు ముందుంటారు. నేరస్తుల ఆటకట్టించరు. గుమ్మళ్లదిబ్బకు చెందిన బాలిక మరణానికి కారణం గంజాయి బానిసలు కాదా?. నిన్నా.. మొన్న ఎందుకు ఖండించలేదు. చనిపోవడంతో ఇప్పుడెందుకు కేసును నీరుగార్చేందుకు యత్నిస్తున్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి నిజానిజాలు నిగ్గు తేల్చాలి. అవసరమైతే న్యాయపోరాటం చేస్తాం.


