పొట్టకూటి కోసం వెళ్లి..
● తెలంగాణలో జిల్లా వాసి మృతి
భూపాలపల్లి అర్బన్/సోమశిల(చేజర్ల): తెలంగాణ రాష్ట్రం భూపాలపల్లి ఏరియాలోని కేటీకే ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ – 2లో సూపర్‌వైజర్‌గా ఉన్న చొప్పరి శ్రీహరి (49) గనిలో జరిగిన ప్రమాదంలో మృతిచెందాడు. సహ కార్మికుల కథనం ప్రకారం.. ఆదివారంవిధులు నిర్వర్తిస్తుండగా వెనుక నుంచి గ్రేడర్ వాహనం ఢీకొనడంతో శ్రీహరి అక్కడిక్కడే చనిపోయాడు. వెంటనే ిసింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించి మృతదేహాన్ని మార్చరీలో భద్రపరిచారు. శ్రీహరి స్వస్థలం నెల్లూరు జిల్లాలో చేజర్ల మండలం తూర్పు కంభంపాడు. ఐదు సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. పిల్లల చదువుల నిమిత్తం కుటుంబం నెల్లూరులో నివాసముంటోంది. స్వగ్రామంలో తల్లిదండ్రులున్నారు. పొట్టకూటి కోసం వెళ్లిన శ్రీహరి మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.


