ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి
● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు(దర్గామిట్ట): చదువు, క్రమశిక్షణ, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే ఏ పరిస్థితినైనా జయించవచ్చని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులతో బుధవారం కలెక్టర్ తన ఛాంబర్‌లో ముఖాముఖి నిర్వహించారు. పిల్లల్ని కలెక్టర్ పేరుపేరునా పలుకరించినవారి చదువు, ఆరోగ్యం, భవిష్యత్ లక్ష్యాలు, ఎదురవుతున్న ఇబ్బందులను ఆరాతీశారు. స్పష్టమైన ప్రణాళికతో చదవాలని సూచించారు. కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన జిల్లాలోని 24 మంది విద్యార్థులకు పీఎం కేర్స్ పథకం ద్వారా రూ.10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.10 లక్షలు చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించి, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో వారి పేరుతో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ పాస్‌బుక్స్‌ను చిన్నారులకు కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హేనాసుజన్, బాలల సంరక్షణాధికారి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
పొదలకూరు
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.30
సన్నవి : రూ.20
పండ్లు : రూ.5
ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి


