కలెక్టరేట్‌లో జాతీయ ఓటర్ల దినోత్సవం
నెల్లూరు(దర్గామిట్ట): నెల్లూరు కలెక్టరేట్ ప్రాంగణంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హిమాన్షు శుక్లా ఉద్యోగస్తుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ ఎం.వెంకటేశ్వర్లు, నగరపాలక సంస్థ కమిషనర్ నందన్, డీఆర్వో విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
కార్డన్ సెర్చ్‌లో 42 వాహనాల స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) దీక్ష ఆధ్వర్యంలో శుక్రవారం వేదాయపాళెం ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు, నగర పోలీసు అధికారులు, సిబ్బంది వైఎస్సార్ నగర్‌లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. బృందాలుగా విడిపోయిన పోలీసులు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాహనపత్రాలు సక్రమంగా లేని 39 మోటార్‌బైక్‌లు, మూడు ఆటోలను స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ముగ్గురు రౌడీషీటర్లు, ఒక సస్పెక్ట్ షీటర్‌ను గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా దీక్ష మాట్లాడుతూ నేర ప్రవృత్తిని వీడకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలు, అనుమాన్పాద వ్యక్తులను గుర్తిస్తే డయల్ 112 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. తనిఖీల్లో బాలాజీనగర్ ఇన్‌స్పెక్టర్ కె.సాంబశివరావు, ఎస్సైలు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో జాతీయ ఓటర్ల దినోత్సవం


