కొత్త నగరాన్ని తలపించేలా ‘సెంట్రల్ వరల్డ్’
నెల్లూరు సిటీ: కొత్త నగరాన్ని తలపించేలా ‘సెంట్రల్ వరల్డ్’ను ఏర్పాటు చేసినట్లు ఆ వెంచర్ మేనేజింగ్ డైరెక్టర్ బొల్లినేని హజరత్‌నాయుడు, డైరెక్టర్ హరిబాబునాయుడు తెలిపారు. నెల్లూరు రూరల్‌లో కనుపర్తిపాడులో గ్రీన్‌హోమ్ సెంట్రల్ వరల్డ్ వెంచర్‌ను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరుకు అతి సమీపంలో సెంట్రల్ వరల్డ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 50 ఎకరాల విశాలమైన ప్రాంతంలో నుడా, రేరా అనుమతులతో వెంచర్‌ను ఏర్పాటు చేశామన్నారు. 5 వేల గజాలలో 25 విల్లాలు నిర్మించబోతున్నామన్నారు. వెంచర్‌లో ప్రత్యేక వాటర్ ట్యాంక్ నిర్మించామని, తద్వారా మున్సిపల్ వాటర్ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. స్విమ్మింగ్ పూల్, పార్కులు, రెస్టారెంట్‌లు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ప్రారంభం రోజే అత్యధిక ప్లాట్లు బుకింగ్ కావడం సంతోషంగా ఉందన్నారు. అత్యాధునికంగా వెంచర్‌ను నిర్మించి, అన్ని వసతులు కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు జ్ఞానశేఖర్, సాయిరామ్, బొల్లినేని ఆనంద్, మల్లికార్జున్‌రెడ్డి పాల్గొన్నారు.
‘సెంట్రల్ వరల్డ్ వెంచర్ ప్రారంభంలో సందడి


