తాతల నుంచి ఈ భూమి మా ఆధీనంలోనే ఉంది
●
మా తాతల కాలం నుంచి ఈ భూమి మా ఆధీనంలోనే ఉంది. ఇటీవల దీన్ని వేరే వారి పేరుపై రిజిస్ట్రేషన్ చేశారని తెలపడంతో నిర్ఘాంతపోయా. రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తులను తీసుకురావాలంటే వారు దుబాయ్, కేరళలో ఉన్నారని టీడీపీ నేత రోశిరెడ్డి చెప్తున్నారు. రిజిస్ట్రేషన్ చేయడానికి వారెవరని ప్రశ్నిస్తే సీఐతో ఫోన్లో బెదిరించారు. రోశిరెడ్డి భూ కబ్జాదారుడనే విషయం గ్రామంలో అందరికీ తెలుసు. ఆయన కుమారుడు మహేష్‌రెడ్డి రేషన్ బియ్యం మాఫియా లో దిట్ట. వీరి కుటుంబీకులు గ్రామంలో 70 ఎకరాలకుపైగా భూములను ఆక్రమించారు.
– అశోక్, బాధిత రైతు, ఆమనిచిరివెళ్ల


