నల్లపరెడ్డి కుటుంబంలో విషాదం
● ప్రసన్న సతీమణి తండ్రి, సీనియర్ న్యాయవాది జనార్దన్‌రెడ్డి కన్నుమూత
కోవూరు : మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన సతీ మణి తండ్రి, నిజామా బాద్ జిల్లాకు చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది కాట్‌పల్లి జనార్దన్‌రెడ్డి (80) ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా వయోభారంతోపాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలోనే కన్నుమూశారు. నిజామాబాద్ జిల్లా రెంజల్‌కు చెందిన జనార్దన్‌రెడ్డికి సీనియర్ న్యాయవాదిగానే కాక, వ్యక్తిగతంగా మహోన్నతమైన పేరుంది. జనార్దన్‌రెడ్డికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన పెద్ద కుమార్తె గీతమ్మను నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వివాహం చేసుకున్నారు. తన మామ మరణవార్త విన్న వెంటనే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి రెంజల్‌కు బయలుదేరారు. జనార్దన్‌రెడ్డి మరణానికి చింతిస్తూ పలువురు రాజకీయ నేతలు, న్యాయవాదులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. నల్లపరెడ్డి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో
జిల్లాకు ఐదో స్థానం
● ఉత్తమ అవార్డును అందుకున్న కలెక్టర్
నెల్లూరు (దర్గామిట్ట): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో అత్యుత్తమ ఎన్నికల మ్యాపింగ్‌ను సమర్థవంతంగా అమలు చేసినందుకు రాష్ట్ర స్థాయిలో ఐదో స్థానం దక్కింది. ఈ మేరకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించిన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో ఈ విశిష్ట సాధనకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చేతుల మీదుగా ఈ అవార్డు కలెక్టర్ హిమాన్షు శుక్లా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్, మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సమక్షంలో అందుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ఎన్నికల యంత్రాంగం సమన్వయంతో చేసిన కృషి ఫలితంగానే ఈ ఘనత సాధ్యమైందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్‌లోనూ మరింత సమర్థవంతంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల ఉప తహసీల్దార్ ఆషర్, ఉత్తమ బీఎల్‌ఓ పర్యవేక్షకుడిగా టీపీగూడూరుకు చెందిన రాంప్రసాద్, జిల్లాలో అత్యధిక మ్యాపింగ్ సాధించిన ఉత్తమ బీఎల్‌ఓగా బొల్లం వెంకట రమణయ్య కూడా అవార్డులు అందుకున్నారు.
విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్‌కు
ఎంఎస్‌ఎం పురస్కారం
నెల్లూరు (క్రైమ్): నె ల్లూరు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ కె. నరసింహరావు పోలీస్ మెడ ల్ ఫర్ మెరిటోరియల్ సర్వీసెస్ (ఎంఎస్‌ఎం) వరించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏటా కేంద్ర ప్రభుత్వం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీసు అధికారులకు అవార్డులు ప్రకటిస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది పోలీసు అధికారులకు ఆదివారం అవార్డులను ప్రకటించింది. బాపట్ల జిల్లా భట్టిప్రోలు గ్రామానికి చెందిన కుందేటి నరసింహరావు 1996లో ఆర్‌ఎస్‌ఐగా పోలీసుశాఖలో బాధ్యతలు చేపట్టి సివిల్ ఎస్‌ఐగా కన్వెర్షన్ పొందారు. 2011లో సీఐగా పదోన్నతి పొందారు. ప్రకాశం, నెల్లూరు జిల్లా లో విధులు నిర్వహించి ప్రస్తుతం నెల్లూరు విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. పని చేసిన ప్రతి చోట సమర్థవంతమైన అధికారిగా పేరు గడించారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించినందుకు ఈ ఏడాది ఆయనకు ఎంఎస్‌ఎం లభించింది. నరసింహరావు ఇప్పటి వరకు సేవాపతకం, ఉత్తమ సేవాపతకం, ఉత్కృష్ట సేవాపతకంతోపాటు 182 ప్రశంసాపత్రాలు, అవార్డులను పొందారు. ఆగస్టులో జరగనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్యమంత్రి చేతుల మీదుగా మెడల్ అందుకోనున్నారు. నరసింహరావుకు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
నల్లపరెడ్డి కుటుంబంలో విషాదం
నల్లపరెడ్డి కుటుంబంలో విషాదం


