అధికారం ఉంది.. మా ఇష్టం
● ఆస్పత్రి వరండాలో లోకేశ్ పుట్టినరోజు వేడుకలు
వాకాడు: అధికారం ఉందని తెలుగుదేశం నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తమ నేతల పుట్టినరోజు వేడుకలు టీడీపీ కార్యాలయంలోనో.. లేదా ఇతర ప్రాంతాల్లో జరుపుకోవాలి. అంతేగానీ ప్రభుత్వాస్పత్రి వరండాలోనే రోగులకు అసౌకర్యంగా టీడీపీ నేతలు మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజు వేడుకలు బుధవారం నిర్వహించడంపై పలువురు విస్తుపోయారు. మండల కేంద్రమైన వాకాడు ప్రభుత్వాస్పత్రి ప్రధాన ద్వారం ఎదురుగా వరండాలో టీడీపీ నేతలు కేక్‌లు కోసుకుని నినాదాలతో సంబరాలు చేసుకున్నారు. దీంతో రోగులు అసౌకర్యానికి గురయ్యారు. ఎన్నో ప్రభుత్వాలు, నేతలను చూశాం గానీ ఇంతవరకు ఇలా ఎవరూ చేయలేదని స్థానికులు విమర్శలు గుప్పించారు. అధికారం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరించడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు.


