యూరియా కోసం తప్పని పడిగాపులు
సోమశిల: అనంతసాగరం మండలంలో మరలా యూరియా కష్టాలు తలెత్తుతున్నాయని, ఆర్‌ఎస్కేలలో యూరియా అందుబాటులో లేక డీలర్ల వద్ద కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నామని రైతులంటున్నారు. అనంతసాగరం మండల కేంద్రంలోని సొసైటీ కేంద్రంలో గురువారం యూరియా అందుబాటులో ఉందని తెలిసి సొసైటీ ప్రాంగణంలో రైతులు భారీగా క్యూలైన్లు గట్టి పడిగాపులు కాశారు. యడగారులో నీరిచ్చి యూరియా అందజేయకుండా నానా అవస్థలు పెట్టారని, అలానే ఇప్పుడు కూడా ఎరువులు ఉపయోగించాల్సిన సమయంలో యూరియా అందుబాటులో లేకుండపోవడం దారుణమని రైతులు వాపోతున్నారు. ఇప్పటికై నా స్టాక్ తెప్పించి రైతులకు అందజేయకుంటే ధర్నాలకు దిగుతామని రైతులు చర్చించుకుంటున్నారు.


