సాక్షిపై మాజీ ఎమ్మెల్సీ వాకాటి చిందులు
నెల్లూరురూరల్: కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి సాక్షిపై, గత ప్రభుత్వంపై చిందులు తొక్కారు. సాక్షి విలేకరి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక గల్లీ స్థాయిలో అభ్యంతరకర భాషలో విరుచుకుపడ్డాడు. బడ్జెట్‌లో అమరావతికి రూ.1500 కోట్లు కేంద్రం ఇస్తున్నట్లుగా చెప్పడంతో.. అప్పుగానే తప్ప.. బడ్జెట్ కేటాయింపులు కాదు కదా? అని ప్రశ్నించిన విలేకరిపై ఆవేశంగా మాట్లాడారు. రైల్వేజోన్, ట్రిపుల్ ఐటీ, గిరిజన యూనివర్సిటీ, పోర్టులకు రైతులకు ఇచ్చే సబ్సిడీలు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించ లేదని ప్రశ్నించడంతో వాకాటి మరింతగా రెచ్చిపోయారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఏం చేశారని ప్రశ్నిస్తున్నారే.. అప్పట్లో కూడా కేంద్ర ప్రభుత్వం మీదే కదా అంటే అప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరంటూ సమాధానం దాటవేశారు. తిరుమల లడ్డూలో కొవ్వు కలవలేదని సాక్షాత్తు సుప్రీం కోర్టు నియమించిన సీఐబీ నివేదిక ఇచ్చినా.. బీజేపీ నేతగా వాకాటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కూటమి నేతల దుష్ప్రచారంపై వైఎస్సార్‌సీపీ నేతలు నిజాలు నిగ్గుతేలాయని చెబుతుంటే జీర్ణించుకోలేక.. వారిపైనా దూషణలకు దిగారు. కూటమిలో భాగస్వామి పార్టీ నేతగా ఉన్న వాకాటి ఆ పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా టీడీపీకి వత్తాసు పలుకుతూ చెలరేగిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
త్వరలో మైపాడులో
బీచ్ ఫెస్టివల్
ఇందుకూరుపేట: ప్రముఖ పర్యాటక కేంద్రమైన మైపాడు బీచ్‌లో త్వరలో బీచ్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నట్లుగా జిల్లా పర్యాటక శాఖ అఽధికారిణి ఉషశ్రీ తెలిపారు. సోమవారం ఆమె మండల తహసీల్దార్ బీ మురళీతో కలిసి మైపాడు బీచ్‌ను పరిశీలించారు. తీరంలోని పరిస్థితులపై అధికారులతో పాటు స్థానికులను ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు తీరంలోని పరిస్థితులను పరిశీలించినట్లుగా తెలిపారు. ఆమె వెంట స్థానిక వీర్వో శ్రీహరి ఉన్నారు.
చిన్నారుల్లో వైకల్యాన్ని
ముందుగా గుర్తించాలి
నెల్లూరు(పొగతోట): గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చిన్నారుల్లో అంగవైకల్యాన్ని ముందుగా గుర్తించాలని ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్ అంగన్‌వాడీకార్యకర్తలకు సూచించారు. సోమవారం సీఆర్సీ కార్యాలయంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పీడీ మాట్లాడారు. పీడీబ్ల్యూడీ, సీఆర్సీ ప్రయోజనాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం అంగవైకల్యాన్ని గుర్తించేందుకు అవసరమై న కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ డైరెక్టర్ మనోజ్‌కుమార్, సీడీపీఓ అరుణ, సీడీఈఐసీ ప్రత్యేక విద్యావేత్త రాకేష్, పునరావాస అఽధికారి ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
పోలీసింగ్‌లో డ్రోన్
టెక్నాలజీ కీలక ఆయుధం
నెల్లూరు(క్రైమ్): పోలీసింగ్‌లో డ్రోన్ టెక్నాలజీ కీలక ఆయుధమని ఏఎస్పీ సీహెచ్ సౌజన్య పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో డ్రోన్ బృందాలకు సోమవారం నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ఏఎస్పీ మాట్లాడారు. కార్డన్ సెర్చ్, ఓపెన్ డ్రింకింగ్, జూదాలు వంటి అక్రమ కార్యకలాపాలపై డ్రోన్ నిఘాను మరింత పెంచాలన్నారు. పాఠశాల, కళాశాలల పరిసరాల్లో ఈవ్‌టీజింగ్ కట్టడికి శక్తి టీమ్‌లను సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహించాలని సూచించారు. పీసీఆర్ ఇన్‌స్పెక్టర్ భక్తవత్సలరెడ్డి, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ బీ శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సాక్షిపై మాజీ ఎమ్మెల్సీ వాకాటి చిందులు
సాక్షిపై మాజీ ఎమ్మెల్సీ వాకాటి చిందులు


