పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాం
నగరంలో పారిశుధ్య మెరుగునకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. ఇప్పటికే అనేక ప్రాంతాల్లోని కాలువల్లో పేరుకుపోయిన మురుగును తొలగించాం. కాలువల్లోని సిల్ట్, వ్యర్థాలను తొలగించి నీరు ప్రవహించేలా చర్యలు చేపట్టాం. పూడిపోయిన పంట కాలువలను శుభ్రం చేసే పనులను ఇంజినీరింగ్ విభాగాధికారులు చూస్తుంటారు. ప్రజలు అంటురోగాల బారిన పడకుండా ఉండేందుకు దోమల నాశనం కోసం బ్లీచింగ్, సున్నం చల్లడం, ఫాగింగ్ వంటి కార్యక్రమాలను చేపడుతున్నాం.
– కనకాద్రి, హెల్త్ ఆఫీసర్, నెల్లూరు కార్పొరేషన్


