ప్రాక్టికల్స్‌కు 207 మంది గైర్హాజరు
నెల్లూరు (టౌన్): ఇంటర్ ప్రాక్టికల్స్‌కు తొలి రోజు ఆదివారం 207 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన ప్రాక్టికల్స్‌లో 3886 మందికి గానూ 137 మంది.. మధ్యా హ్నం నిర్వహించిన పరీక్షకు మూడు వేల మందికి 70 మంది గైర్హాజరయ్యారు. కేంద్రాలను ఆర్‌ఐఓ, పరీక్షల కమిటీ జిల్లా సభ్యులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ చేశారు.
దర్గాలో వక్ఫ్ బోర్డు
సీఈఓ ప్రార్థనలు
అనుమసముద్రంపేట: మండల కేంద్రంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన హజరత్ ఖాజారసూల్ దర్గాను రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓ యాకూబ్ అలీ ఆదివారం సందర్శించారు. ఆయన్ను దర్గా ఈఓ హుస్సేన్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఏఎస్‌పేట దర్గాను అభివృద్ధి చేయనున్నామని వెల్లడించారు. రోజువారీ కార్యక్రమాలపై ఈఓను అడిగి తెలుసుకున్నారు. మాజీ సీఈఓ అబ్దుల్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.
తమిళనాడు పీడీఎస్
బియ్యం పట్టివేత
వెంకటాచలం(పొదలకూరు): బాయిల్డ్ రైస్‌ను నెల్లూరు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. అధికారుల వివరాల మేరకు.. చైన్నె నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న లారీని తనిఖీ చేయగా, తమిళనాడులోని పీడీఎస్ బియ్యా న్ని ఉడికించి అక్రమంగా తరలిస్తున్నారనే అంశాన్ని గుర్తించారు. లారీలో 712 గోనె, పాస్టిక్ సంచుల్లో ప్యాకింగ్ చేసి ఉండటాన్ని కనుగొన్నారు. రూ.10 లక్షల విలువైన లారీతో పాటు 349.65 క్వింటాళ్ల బియ్యం మొత్తం రూ.18,74,125గా తేల్చారు. స్వాధీ నం చేసుకున్న బియ్యాన్ని నెల్లూరు ఎమ్మెల్‌ఎస్ పాయింట్‌లో అప్పగించారు. బియ్యం కొనుగోలుదారుడు, మధ్యవర్తి హరినాఽథ్‌రెడ్డి, శంకర్, లారీ యజమాని మజహర్, డ్రైవర్ యరగర్ల శివప్రసాద్‌పై నిత్యావసర చట్టం కింద 6 – ఏ కేసును నమోదు చేశారు. విజిలెన్స్ సీఐ అక్కిశెట్టి శ్రీహరిరావు, సివిల్ సప్లయ్స్ అధికారి లక్ష్మీనారాయణరెడ్డి, విజిలెన్స్ తహసీల్దార్ కృష్ణప్రసాద్, విజిలెన్స్ ఇంజినీర్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యథేచ్ఛగా
గ్రావెల్ తవ్వకాలు
● దగదర్తిలో జోరుగా సాగుతున్న వైనం
● భయభ్రాంతులకు
గురవుతున్న స్థానికులు
దగదర్తి: మండలంలో గ్రావెల్ అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అనంతవరం సర్వే నంబర్ – 2లో అటవీ భూములను ఆనుకొని ఉన్న ప్రాంతంలో ఎలాంటి అనుమతుల్లేకుండా యంత్రాల సాయంతో తవ్వి టిప్పర్లలో తరలిస్తున్నారు. అధిక లోడుతో ఇవి ఎస్సీ కాలనీ మీదుగా వేగంగా వెళ్తుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. వీటి కారణంగా రోడ్డు గుంతలమయంగా మారుతోంది. దీనిపై డీటీ భాగ్యలక్ష్మికి సీపీఎం మండల కార్యదర్శి గోపసాని రమేష్ ఫోన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. అనుమతుల్లేకుండా తరలిస్తే తమ పార్టీ ఆధ్వర్యంలో అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కాగా ఈ విషయమై డీటీని సంప్రదించగా, అనంతవరంలో గ్రావెల్ తవ్వకాలకు ఎలాంటి అనుమతుల్లేవని, దీనిపై ఫిర్యాదులు రాగా, వీఆర్వోను వెంటనే పంపించి నిలిపేయించామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవ ని ఆమె స్పష్టం చేశారు.
ప్రాక్టికల్స్‌కు 207 మంది గైర్హాజరు
ప్రాక్టికల్స్‌కు 207 మంది గైర్హాజరు


