ప్రాణం తీసిన అతివేగం
● ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి
నెల్లూరు(క్రైమ్): రటాక్టర్ మితిమీరిన వేగంతో మోటార్‌బైక్‌ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన పెన్నా నూతన బ్రిడ్జిపై చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కోవూరు మండలం లేగుంటపాడుకు చెందిన షేక్ రఫీ (30), బషీర్‌ఖాన్ స్నేహితులు. ఇద్దరూ కార్పెంటర్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం వారు నెల్లూరు హరనాథపురంలో పనులు చేసుకుని బైక్‌పై జాతీయ రహదారి మీదుగా ఇంటికి బయలుదేరారు. రఫీ బైక్ నడుపుతున్నాడు. కొత్త పెన్నానది బ్రిడ్జిపైకి వచ్చేసరికి ట్రాక్టర్ మితీమిరిన వేగంతో వెనుకవైపు నుంచి బైక్‌ను ఢీకొంది. రఫీకి తీవ్రగాయా లై మృతిచెందాడు. బషీర్‌కు స్వలగాయాలయ్యాయి. ప్రమాద ఘటనపై సమాచా రం అందుకున్న నార్త్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. రఫీకి భార్య, పిల్లలున్నారు.


