మమ్మల్ని ఆదుకోండి సారూ.. | - | Sakshi
Sakshi News home page

మమ్మల్ని ఆదుకోండి సారూ..

Feb 3 2026 7:15 AM | Updated on Feb 3 2026 7:15 AM

మమ్మల్ని ఆదుకోండి సారూ..

మమ్మల్ని ఆదుకోండి సారూ..

కలెక్టరేట్‌లో

‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

వినతులు స్వీకరించిన అధికారులు

నెల్లూరు(దర్గామిట్ట): ‘మా వినతులు పరిశీలించి ఆదుకోండి సారూ’ అంటూ అర్జీదారులు అధికారులను కోరారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్‌కుమార్‌, డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ కృష్ణకుమార్‌, జెడ్పీ సీఈఓ శ్రీధర్‌రెడ్డి, డీపీఓ వసుమతి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భూ సమస్యలు, పింఛన్లకు సంబంధించి అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని, వాటిపై అధికారులు ప్రత్యేకశ్రద్ధ పెట్టాలన్నారు.

అక్రమంగా ఇసుక తవ్వకాలు

కలువాయి మండలం నూకనపల్లి, తెలుగురాయ పురం గ్రామాల్లో అక్రమ ఇసుక తవ్వకాలు నిలు పుదల చేయించాలని ఆయా గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు అధికారులకు వినతిపత్రమిచ్చారు. వారు మాట్లాడుతూ తవ్వకాలతో పొలాల్లోని బోర్లు, బావుల్లో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోయిందన్నారు. సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయని, రైతుల జీవనాధారం పూర్తిగా ప్రమాదంలో పడినట్లు వాపో యారు. తవ్వకాలు ఆపించి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని విన్నవించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement