కండలేరులో 60.06 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 60.06 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 600 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,500, లోలెవల్ కాలువకు 300, హైలెవల్ కాలువకు 150, పిన్నేరు కాలువకు 250, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
గణతంత్ర వేడుకల్లో విదేశీయులు
నెల్లూరు(దర్గామిట్ట): పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో విదేశీయులు సందడి చేశారు. స్పెయిన్ దేశానికి చెందిన జువానా, యానా వేడుకల్లో పాల్గొన్నారు. వారి వెంట డిప్యూటీ మేనేజర్ అరుణ ఉన్నారు.


