సీఎంఆర్, చందనలో లక్కీ డ్రా
నెల్లూరు(బృందావనం): క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతికి చందన, సీఎంఆర్ ప్రవేశపెట్టిన ఫెస్టివ్ వండర్స్ స్కీమ్‌లో భాగంగా సోమవారం మెగా బంపర్ డ్రాను కోవూరు ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తీశారు. టాటా టియోగో కారును ముత్తుకూరు మండలం జంగాలదొరువుకు చెందిన ఎం.వైష్ణవి గెలుచుకున్నారు. గత వారం స్కూటీ విజేత గిద్దలూరుకు చెందిన ఎం.గాయత్రికి మోడల్ కీని అందజేశారు. 35 మంది డైలీ డ్రా విజేతలకు గ్రైండర్, ప్యాన్ సెట్, మిక్సీ, రైస్‌కుక్కర్, డిన్నర్‌సెట్లను పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ సీఎంఆర్, చందన అంటే ప్రజలు ఎంతో అభిమానిస్తారన్నారు. కార్యక్రమంలో సీఎంఆర్ అధినేత మావూరి శ్రీనివాసరావు, డైరెక్టర్లు సంతోష్, గణేష్, మోపూరు పెంచలయ్య, మేనేజర్ కిశోర్ పాల్గొన్నారు.


