కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం
కావలి(దగదర్తి): కావలి సమీపంలోని గౌరవరం జాతీయ రహదారిపై సోమవారం మోటార్‌బైక్‌ను కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గౌరవరం గ్రామానికి చెందిన తిప్పారెడ్డి శ్రీనివాసరెడ్డి (59) తన బైక్‌పై పొలానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టింది. దీంతో శ్రీనివాసరెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. కావలి రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.


