కలెక్టర్ బంగ్లాలో తేనీటి విందు
నెల్లూరు(దర్గామిట్ట): గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ హిమాన్షు శుక్లా సోమవారం సాయంత్రం తన బంగ్లాలో అధికారులు, ప్రజాప్రతినిధులకు తేనీటి విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరి ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎస్పీ అజిత, ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర, బల్లి కల్యాణ్ చక్రవర్తి, ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కాకర్ల సురేష్, కురుగొండ్ల రామకృష్ణ, దగుమాటి వెంకట కృష్ణారెడ్డి, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్‌కుమార్, ఆర్డీఓలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.


