తిరుమల లడ్డూపై దుష్ప్రచారం దుర్మార్గం | - | Sakshi
Sakshi News home page

తిరుమల లడ్డూపై దుష్ప్రచారం దుర్మార్గం

Feb 3 2026 7:57 AM | Updated on Feb 3 2026 7:57 AM

తిరుమల లడ్డూపై దుష్ప్రచారం దుర్మార్గం

తిరుమల లడ్డూపై దుష్ప్రచారం దుర్మార్గం

నెల్లూరు(క్రైమ్‌): పవిత్రమైన తిరుమల లడ్డూపై ఆరోపణలన్నీ అవాస్తవమని సీబీఐ నివేదిక ఇచ్చినా ఇంకా కొందరు తప్పుడు ప్రచారాలు, అసత్యాలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ దుష్ప్రచారం సాగిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పోలీసు అధికారులను కోరారు. ఈ మేరకు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి ఆనం విజయకుమార్‌రెడ్డి, పార్టీ శ్రేణులతో కలిసి వేదాయపాళెం ఇన్‌స్పెక్టర్‌ కే శ్రీనివాసరావుకు సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆటవిక పాలన రాజ్యమేలుతోందన్నారు. ఎక్కడ చూసినా దాడులు, దోపిడీలు, దౌర్జన్యాలు, హత్యాయత్నాలు జరుగుతున్నాయన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ నిరాధారమైన ఆరోపణలు చేయడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. లడ్డూ వ్యవహారంలో గత ప్రభుత్వ ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి మీద నిందలు వేశారన్నారు. సీబీఐ విచారణ ద్వారా నిజానిజాలు బయటకు వచ్చాయన్నారు. ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్‌ఐ రిపోర్ట్‌లలో లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని నిర్ధారణ అయిందన్నారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు నిరాధారమని ఆధారాలతో సహా నిరూపితమైందన్నారు. అయినప్పటికీ నిసిగ్గుగా నేడు అదే అసత్యాలను ఫ్లెక్సీలు, బ్యానర్ల రూపంలో ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఆ ఫ్లెక్సీలను తొలగించమని కోరితే మాజీ మంత్రుల ఇళ్లపై దాడి చేస్తారా? మీరు చేసే తప్పుల ను ప్రశ్నిస్తే భౌతిక దాడులు చేస్తారా? చంపేస్తారా? అని ప్రశ్నించారు. ఆరు గంటల పాటు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ మూకలు దాడి చేస్తుంటే రక్షించాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటిపైన టీడీపీ మూకలు పెట్రోల్‌ బాంబులు వేశాయన్నారు. అంబటి రాంబాబు ‘అనుకోని పరిస్థితుల్లో మాట తూలాను..చంద్రబాబునాయుడును ఏమీ అనలేదు..నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా’ అని చెప్పినా ఇంటిమీద దాడిచేయడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి కక్ష పూరిత దాడులు ఆంధ్రరాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదన్నారు. ఆంధ్రరాష్ట్రం కూటమి పాలనలో రావణ కష్టంలా రగిలిపోతోందని, ఆటవిక పాలనతో అతలాకుతలమవుతోందన్నారు. దీనికి కూటమి ప్రభు త్వం భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు. శ్రీవా రి లడ్డూ వ్యవహారాన్ని, గీతం వర్శిటీకి ఐదువేల కోట్ల రూపాయల విలువైన భూముల అప్పగింత వ్యవహారాలను పక్కదోవ పట్టించేందుకే ఈ డైవర్షన్‌ పాలిటిక్స్‌ అని ప్రజలు అభిప్రాయపడుతున్నారన్నారు. పోలీసులు పక్షపాత ధోరణిని విడనాడాలని, అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాయడం ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదన్నారు. తామిచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి ఫ్లెక్సీలను ఎవరు కట్టారు? ఎవరు కట్టించారు? ధన సాయం ఎవరు చేశారు? ఎవరి ప్రోద్బలంతో కట్టారో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో భక్తులకు మనోవేదనను కలిగించిన చంద్రబాబునాయుడు, లోకేశ్‌, పవన్‌కళ్యాణ్‌ భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలు చేసి తిరుమల లడ్డూ ప్రసాదం పవిత్రతను దెబ్బతీయడమే కాకుండా హిందువుల మనోభావాలను కించపరిచారన్నారు. లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వును వినియోగించలేదని సీబీఐ నివేదికతో వెల్లడైనా దాన్ని వక్రీకరిస్తూ ప్రజల్లోకి అవాస్తవాలను తీసుకెళ్లేందుకు కూటమి నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం సిగ్గుచేటన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించాలని కోరిన అంబటి రాంబాబు ఇంటిపై కూటమి నేతలు దుర్మార్గంగా దాడిచేశారన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రశాంతతను పాడుచేస్తూ కూటమి నేతలు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారన్నారు. కూటమి నేతలు చేస్తున్న అక్రమాలు, అవాస్తవ ప్రచారాలపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నా రు. పోలీసులు కేసులు నమోదు చేయకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు. చంద్రబాబు కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామిని తన స్వార్థ రాజకీయాలకు వాడుకుంటూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని, దీన్ని ప్రజలు క్షమించరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఆనం విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ దేవదేవుడిని రాజకీయాలకు వాడుకోవడం చంద్రబాబునాయుడుకే చెల్లిందన్నారు. పవిత్రమైన తిరు మల లడ్డూపై ఏ విషయం తేలకముందే ఎవరూ మాట్లాడవద్దని న్యాయస్థానాలు ఆదేశించినా తెలుగుదేశం పార్టీ నాయకులు పెడచెవిన పెట్టారన్నారు. ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్‌ఐ రిపోర్టులో లడ్డూలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని నిర్ధారణ అయిన తర్వాత చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌, లోకేశ్‌లు ప్రజలకు ముఖం చూపించేందుకు ఇబ్బంది పడుతామని ఇంకా అసత్యప్రచారాలు కొనసాగించడం దుర్మార్గమన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు మొయిళ్ల గౌరీ, ఖలీల్‌అహ్మద్‌, మందల వెంకట శేషయ్య, చేజర్ల సుబ్బా రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, వివిధ విభాగాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోండి

వేదాయపాళెం ఇన్‌స్పెక్టర్‌కు

వైఎస్సార్‌సీపీ నేతల ఫిర్యాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement