టెర్మినల్ పునరుద్ధరణకు కృషి చేయాలి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టె ర్మినల్‌ను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభు త్వం కృషి చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్రసాయి డిమాండ్ చేశారు. నగరంలోని సంతపేటలో ఉన్న ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టెర్మినల్ తొలగించిన సమయంలో పునరుద్ధరించాలంటూ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తమతో పోరాటం చేసిన విషయాన్ని మర్చిపోయినట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వస్తే టెర్మినల్‌ను పునరుద్ధరిస్తామని చెప్పిన టీడీపీ నేడు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ, అదానీ కంపెనీకి భూములను పందేరం చేస్తోందని ఆరోపించారు.
వచ్చేనెల 9న ప్రేరణ ఉత్సవం ఫేస్ – 2
నెల్లూరు(టౌన్): మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వచ్చేనెల 9వ తేదీన కృష్ణాపురంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రేరణ ఉత్సవం ఫేస్ – 2 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఈఓ ఆర్.బాలాజీరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, సీబీఎస్‌ఈ పాఠశాలలు, కళాశాలల్లో 8వ తరగతి నుంచి 11వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. ప్రతి స్కూల్, కళాశాల నుంచి ఇద్దరికి (ఒక బాలుడు, ఒక బాలిక) మాత్రమే అవకాశం ఉందన్నారు. వికసిత్ భారత్ 2047, మై కాంట్రిబ్యూషన్ టు వార్డ్స్ సొసైటీ అండ్ నేషన్, వై షుడ్ బీ సెలెక్టెడ్ ఫర్ ప్రేరణ, మై విజన్ ఆఫ్ ఇండియా అంశాల్లో వ్యాసరచన, కవితా రచన, కథ, సాంగ్, వ్యంగ్య చిత్రం గీయడం, డ్రాయింగ్ విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. పాఠశాల స్థాయిలో పాల్గొనే విద్యార్థులు ముందుగా https://prerana. education.gov.in వెబ్‌సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 88861 94201, 94929 45017 ఫోన్ నంబర్లను సంప్రదించాలని తెలియజేశారు.
రోడ్డు ప్రమాదంలో
డ్రైవర్ మృతి
నెల్లూరు(క్రైమ్): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. సౌత్ ట్రాఫిక్ పోలీసుల కథనం మేరకు.. కృష్ణ జిల్లా పెద్దపారుపుడికి చెందిన ఎ.అజయ్ (23) అవి వివాహితుడు. అతను టాటా దోస్త్ వాహన డ్రైవర్. అజయ్ గురువారం రాత్రి ఇంజిన్ ఆయిల్ లోడ్‌తో చిత్తూరుకు బయలుదేరాడు. శుక్రవారం తెల్లవారుజామున గొలగమూడి క్రాస్‌రోడ్డుకు చేరుకుంటుండగా ముందు సిమెంట్ బ్రిక్స్‌తో వెళ్తున్న లారీ ఒక్కసారిగా బ్రేక్ వేసింది. వేగాన్ని నియంత్రించలేక అజయ్ లారీ ట్రాలీని ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సౌత్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కె.వెంకట్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు అంకమరావు, జయలక్ష్మి నెల్లూరుకు చేరుకుని విగతజీవిగా ఉన్న కుమారుడిని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. తల్లి ఫిర్యాదు మేరకు ఇన్‌స్పెక్టర్ కేసు నమోదు చేశారు.
ఆలయాల్లో చోరీలు
మర్రిపాడు: మండలంలోని చిలకపాడు, సన్నువారిపల్లి, శెట్టిసముద్రంలోని ఎనిమిది ఆలయాల్లో గురువారం రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. గ్రామస్తుల ఫిర్యాదుతో శుక్రవారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.34 సన్నవి : రూ.20
పండ్లు : రూ.10
టెర్మినల్ పునరుద్ధరణకు కృషి చేయాలి


