వేతనజీవులకు నిరాశ
నెల్లూరు(టౌన్): కేంద్ర బడ్జెట్‌లో నూతన, పాత ఆదాయ పన్ను శ్లాబులను మార్చకపోవడం వేతనజీవులను నిరాశపరిచిందని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అల్లంపాటి సురేంద్రరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సేవింగ్స్ పరిమితిని కనీసం రూ.2.5 లక్షలకు పెంచి ఉంటే పొదుపు చేసుకోవడానికి ప్రోత్సాహం ఉండేదన్నారు. రీసెర్చ్‌లో కొత్త ఉద్యోగాలు, ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్‌మెంట్ కమిటీ స్వాగతించాల్సిన అంశాలైనా రాష్ట్ర విభజనతో ఏర్పడిన లోటు బడ్జెట్ పూడ్చడానికి, ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చడానికి విభజన చట్టం ప్రకారం ప్రత్యేక హోదా ప్రకటించాల్సి ఉందన్నారు. ఉద్యోగలందరూ కోరుకునే విధంగా ఆర్థిక భద్రత కల్పించడానికి సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం ప్రకటించి ఉంటే బాగుండేదన్నారు.
రైతులకు భరోసా కల్పించలేదు
నెల్లూరు(దర్గామిట్ట): బడ్జెట్ వ్యవసాయ రంగానికి, రైతుల అభివృద్ధికి ఎటువంటి భరోసా కల్పించలేదని, తీవ్ర నిరాశ మిగిల్చిందని ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చిరసాని కోటిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మద్దతు ధరల అమలుకు నిధుల కేటాయింపు లేదన్నారు. ప్రస్తుతం రైతాంగం పండించే ఏ పంటలకు కనీస మద్దతు ధరలు లభించడం లేదన్నారు. రైతుల్ని ప్రోత్సహించేలా బడ్జెట్‌లో మార్పులు చేయాలన్నారు.
చిరసాని కోటిరెడ్డి
సురేంద్రరెడ్డి
వేతనజీవులకు నిరాశ


