కృష్ణపట్నం పోర్టులో స్థానికులకే ఉద్యోగావకాశాలు | - | Sakshi
Sakshi News home page

కృష్ణపట్నం పోర్టులో స్థానికులకే ఉద్యోగావకాశాలు

Feb 5 2026 7:18 AM | Updated on Feb 5 2026 7:18 AM

కృష్ణ

కృష్ణపట్నం పోర్టులో స్థానికులకే ఉద్యోగావకాశాలు

ముత్తుకూరు(పొదలకూరు): అదానీ కృష్ణపట్నం పోర్టులో జిల్లాకు చెందిన వారికే 70 శాతం మేర ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నామని యాజమాన్యం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘భూముల త్యాగం.. ఉద్యోగాల్లో మోసం’ శీర్షికన సాక్షిలో బుధవారం ప్రచురితమైన కథ నానికి వారు స్పందించారు. ఇక్కడి శ్రామికుల్లో 76 శాతం మంది రాష్ట్రానికి చెందిన వారేనని తెలిపింది. స్థానికంగా ఉపాధి అవకాశాలను సృష్టించడం, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడేందుకు కృషి చేస్తున్నామని వివరించింది. భవిష్యత్తులో వచ్చే సవాళ్లను స్వీకరించేందుకు, నైపుణ్యాలను పెంపొందించేందుకు పని శక్తిని కొనసాగించనున్నామని వెల్లడించింది.

అమరావతికి చేరిన

నీటి పంచాయితీ

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): జిల్లాలో సాగునీరు పుష్కలంగా ఉన్నా, దాన్ని అందించే విషయంలో సమస్యలు నెలకొన్నాయి. జిల్లా స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలను టీడీపీ ప్రభుత్వం గాలికొదిలింది. నీటి వినియోగదారుల సంఘ అధ్యక్ష, ఉపాధ్యక్షులు, ఇంజినీర్లను రాష్ట్రస్థాయి సమావేశం నిమిత్తం అమరావతికి పిలిచారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం గురువారం మధ్యాహ్నం నుంచి జరగనుంది. ఇక్కడ పరిష్కరించలేని వాటిని అక్కడ ఎలా చక్కదిద్దుతారోనంటూ సమావేశానికి వెళ్తున్న వారే పేర్కొనడం గమనార్హం.

అపార్‌ వ్యవస్థతో

భవిష్యత్తుకు భరోసా

వెంకటాచలం: అకడమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్స్‌ ఆటోమేటెడ్‌ పర్మనెంట్‌ అకడమిక్‌ అకౌంట్‌ రిజిస్ట్రీ (అపార్‌)తో విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా లభిస్తుందని వీఎస్‌యూ వీసీ అల్లం శ్రీనివాసరావు పేర్కొన్నారు. అపార్‌ క్రెడిట్‌ సీడింగ్‌పై మండలంలోని కాకుటూరు వద్ద గల వర్సిటీలో బుధవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. ఈ వ్యవస్థ ద్వారా విద్యార్థుల అకడమిక్‌ క్రెడిట్లను డిజిటల్‌ రూపంలో భద్రపర్చనున్నారని వివరించారు. కార్యక్రమంలో ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ రత్నా షీలామణి, డిజిటల్‌ ఇండియా కార్పొరేషన్‌ ప్రాంతీయ సమన్వయకర్త రవి పాండే, వీఎస్‌యూ ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ సునీత, ప్రిన్సిపల్‌ విజయ, వెంకట్రాయులు, మధుమతి, సుజాత తదితరులు పాల్గొన్నారు.

21 బార్లకు..

84 దరఖాస్తులు

నెల్లూరు(క్రైమ్‌): జిల్లాలో ఓపెన్‌ కేటగిరీలో మిగిలిపోయిన బార్ల దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. 21 బార్లకు గానూ 84 దరఖాస్తులొచ్చాయి. నెల్లూరు కార్పొరేషన్‌ పరిధిలో 18.. కావలి పరిధిలో రెండు, ఆత్మకూరు పరిధిలో ఒకటి.. ఇలా మొత్తంగా 21 బార్లకు రీ నోటిఫికేషన్‌ను ఎకై ్సజ్‌ అధికారులు గత నెల 27న విడుదల చేశారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియడంతో కలెక్టరేట్లోని శంకరన్‌ హాల్లో లాటరీ డ్రాను గురువారం నిర్వహించనున్నారు.

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి

ఉదయగిరి: ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రోత్సహించాలని ప్రకృతి వ్యవసాయ జిల్లా మేనేజర్‌ కన్నయ్య పేర్కొన్నారు. రైతు సాధికారత సంస్థ ఆధ్వర్యంలో ఏపీ కమ్యూనిటీ మేనేజ్‌మెంట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ పథకంలో భాగంగా పట్టణంలోని బిట్‌ – 1 రైతు సేవా కేంద్రంలో అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలపై సీఆర్పీలతో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పెట్టుబడులను రైతులు తగ్గించుకొని.. నాణ్యమైన అధిక దిగుబడులను పొందొచ్చని చెప్పారు. అనంతరం మట్టి నమూనాల సేకరణపై అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయంతో సాగు చేసిన పంటలను పరిశీలించారు. రీజినల్‌ సాంకేతిక కోఆర్డినేటర్‌ రవిచంద్రప్రసాద్‌, ఏడీఏ చెన్నారెడ్డి, సిబ్బంది మల్లికార్జున, ట్రెయినర్‌ రామ్మోహన్‌ పాల్గొన్నారు.

కృష్ణపట్నం పోర్టులో స్థానికులకే ఉద్యోగావకాశాలు 1
1/2

కృష్ణపట్నం పోర్టులో స్థానికులకే ఉద్యోగావకాశాలు

కృష్ణపట్నం పోర్టులో స్థానికులకే ఉద్యోగావకాశాలు 2
2/2

కృష్ణపట్నం పోర్టులో స్థానికులకే ఉద్యోగావకాశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement