రోడ్డు దాటుతుండగా..
● లారీ ఢీకొని
వ్యక్తి మృతి
కలువాయి(సైదాపురం): రోడ్డు దాటుతున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో మృతిచెందిన ఘటన కలువాయి మండలంలో గురువారం చోటుచేసుకుంది. అనంతసాగరం మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన భాగాది నరసింహులు(38) పది రోజుల క్రితం మాదన్నగారిపల్లెలోని తన బంధువుల ఇంటికి వచ్చాడు. గురువారం మాదన్నగారిపల్లె వద్ద జాతీయ రహదారిని దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్ లారీని ఘటనా స్థలంలోనే వదిలి పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


