శ్రీవారి హుండీ కానుకల లెక్కింపు
రాపూరు: పెంచలకోన క్షేత్రంలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాల్లోని హుండీల కానుకల లెక్కింపులో భారీ రాబడి వచ్చిందని ఏసీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. శ్రీవారి అలంకార మండపంలో బుధవారం కానుకల్ని లెక్కించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 రోజులకు గానూ రూ.35,36,474 వచ్చిందన్నారు. బంగారం 24 మిల్లీ గ్రాములు, వెండి 691 గ్రాములు వచ్చినట్లు చెప్పారు. పలు విదేశీ నాణ్యాలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో జిల్లా దేవదాయశాఖ అధికారులు, జె.శ్రీనివాసరావు, పి.శ్రీనివాసులు పాల్గొన్నారు.


