నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
నెల్లూరు (టౌన్): ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ను ఆదివారం నుంచి ఈ నెల పది వరకు నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 130 కేంద్రాల్లో నిర్వహించనున్న ప్రాక్టికల్స్‌కు 21,952 మంది హాజరుకానున్నారు. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12, మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు వరకు నిర్వహించనున్నారు. 1300 మందికిపైగా ఎగ్జామినర్లు, 130 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 130 మంది డిపార్ట్‌మెంట్ అధికారులను నియమించారు. విద్యార్థుల సౌకర్యార్థం 0861 – 2320312 నంబర్‌తో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. నాన్ జంబ్లింగ్ విధానంలో పరీక్షలను నిర్వహించనున్నారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను బిగించాలని ఇంటర్ బోర్డు అధికారులు ఆదేశించారు. మాస్ కాపీయింగ్‌కు తావు లేకుండా రెండు ఫ్లయింగ్ స్క్వాడ్లతో పాటు జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు తనిఖీలు జరపనున్నారు.
ఏపీఆర్వోకు ఉద్యోగోన్నతి
నెల్లూరు రూరల్: నెల్లూరు సమాచార, పౌర సంబంధాల శాఖ ఏపీఆర్వో అళహరి రవీంద్రబాబుకు డివిజనల్ పీఆర్వోగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులను ప్రభుత్వం శనివారం జారీ చేసింది. ఈ మేరకు ఆయన్ను గుంటూరు బదిలీ చేశారు.


