జిల్లా వ్యాప్తంగా నాకాబందీ | - | Sakshi
Sakshi News home page

జిల్లా వ్యాప్తంగా నాకాబందీ

Feb 6 2026 7:21 AM | Updated on Feb 6 2026 7:21 AM

జిల్ల

జిల్లా వ్యాప్తంగా నాకాబందీ

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ 13,

ఓపెన్‌ డ్రింకింగ్‌పై 27 కేసుల నమోదు

నెల్లూరు(క్రైమ్‌): నేర నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడిలో భాగంగా మంగళవారం రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు నాకాబందీ నిర్వహించారు. ప్రధాన కూడళ్లు, హైవే ప్రవేశం, నిష్క్రమణ, శివారు ప్రాంతాల్లో వాహన తనిఖీలు నిర్వహించారు. 1,571 వాహనాలు తనిఖీ చేయగా 13 మంది మద్యం మత్తులో నడుపుతుండటంతో కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన 121 మందిపై కేసు నమోదు చేసి రూ.73,345 అపరాధరుసుము విధించారు. బహిరంగ మద్యం సేవనంపై 27 కేసులు నమోదు చేశారు. జిల్లా వ్యాప్తంగా 51 లాడ్జీలను తనిఖీ చేశారు.

● షబ్‌ – ఏ – బరాత్‌ (పవిత్ర జాగరణ రాత్రి) సందర్భంగా మంగళవారం అర్ధరాత్రి నగర ఏఎస్పీ దీక్ష నెల్లూరులోని మసీదులను సందర్శించారు. కమిటీలు, పెద్దలు, స్థానిక ముస్లింలతో మాట్లాడారు. ఆమె వెంట నగర ఇన్‌స్పెక్టర్లున్నారు.

జిల్లా వ్యాప్తంగా నాకాబందీ 1
1/1

జిల్లా వ్యాప్తంగా నాకాబందీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement