వైఎస్సార్సీపీ లీగల్‌ సెల్‌లో పలువురికి పదవులు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్సీపీ లీగల్‌ సెల్‌లో పలువురికి పదవులు

Jan 24 2026 8:48 AM | Updated on Jan 24 2026 8:48 AM

వైఎస్

వైఎస్సార్సీపీ లీగల్‌ సెల్‌లో పలువురికి పదవులు

నెల్లూరు (లీగల్‌): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లీగల్‌ సెల్‌లో జిల్లాకు చెందిన పలువురు న్యాయవాదులకు చోటు కల్పిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులను జారీ చేసింది. నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది రామిరెడ్డి రోజారెడ్డిని రాష్ట్ర లీగల్‌ సెల్‌ జోన్‌ – 4 వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా, నెల్లూరు రూరల్‌కు చెందిన సిద్ధన సుబ్బారెడ్డిని లీగల్‌ సెల్‌ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీగా, నెల్లూరు సిటీకి చెందిన నావూరు శ్రీధర్‌, రమాదేవిని లీగల్‌ సెల్‌ రాష్ట్ర సెక్రటరీలుగా, నెల్లూరు రూరల్‌, కావలికి చెందిన చుండూరు శ్రీధర్‌రావు, సునీల్‌కుమార్‌సింగ్‌ను లీగల్‌ సెల్‌ రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీలుగా, నెల్లూరుకు చెందిన కమలాకర్‌రెడ్డిని లీగల్‌ సెల్‌ నెల్లూరు సిటీ ప్రెసిడెంట్‌గా నియమించారు.

సీతారామపురం

ఎస్సై సస్పెన్షన్‌

సతారామపురం: స్థానిక ఎస్సైగా 15 నెలలుగా విధులు నిర్వర్తిస్తున్న శివకృష్ణారెడ్డిని శుక్రవారం సస్పెండ్‌ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంతో పాటు పలు ఆరోపణల నేపథ్యంలో సంబంధిత యంత్రాంగం విచారణ జరిపి నివేదికను పంపింది. ఈ క్రమంలో సస్పెన్షన్‌ వేటేశారు. ఉదయగిరి ఎస్సై శ్రీనివాసులుకు ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించారు.

శ్రీవారి దర్శనానికి

12 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని 64,571 మంది గురువారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకునేందుకు 12 గంటల సమయం పడుతోంది.

వైఎస్సార్సీపీ లీగల్‌ సెల్‌లో పలువురికి పదవులు 
1
1/2

వైఎస్సార్సీపీ లీగల్‌ సెల్‌లో పలువురికి పదవులు

వైఎస్సార్సీపీ లీగల్‌ సెల్‌లో పలువురికి పదవులు 
2
2/2

వైఎస్సార్సీపీ లీగల్‌ సెల్‌లో పలువురికి పదవులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement