వేమిరెడ్డి దంపతులు గిరిజన ద్రోహులు
● నెల్లూరు మాజీ మేయర్ స్రవంతి
కోవూరు: నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గిరిజన ద్రోహులని నెల్లూరు మాజీ మేయర్ పొట్లూరి స్రవంతి ధ్వజమెత్తారు. ఆమె కోవూరు మండల పరిధిలోని పోతిరెడ్డిపాళెం గిరిజన కాలనీలో సోమవారం ఇంటింటికీ తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోవూరు ఏఎంసీ చైర్మన్ పదవి గిరిజనులకు దక్కాల్సి ఉండగా, తమ అనుచరుడికి కట్టబెట్టాలని వారు కుట్రలు పన్నారన్నారు. అయితే న్యాయస్థానం వారి దుర్మార్గపు ఆలోచనలకు అడ్డుకట్ట వేసి తగిన బుద్ధి చెప్పిందని పేర్కొన్నారు. కోవూరు జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీలత మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలను అణచి వేయడమే ధ్యేయంగా వేమిరెడ్డి దంపతులు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం
నెల్లూరు(దర్గామిట్ట): నగరపాలక సంస్థ నూతన మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వకుండా జాప్యం చేయడంపై గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. సోమవారం రిలే నిరాహార దీక్షలో గిరిజన సంఘాల తరఫున బాపట్ల వేంకటపతి పాల్గొని ప్రభుత్వం, వేమిరెడ్డి దంపతుల తీరును ఎండగట్టారు. అనంతరం కలెక్టర్ హిమాన్షు శుక్లాకు వినతిపత్రం సమర్పి ంచారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నేతలు తలపల జయవర్ధన్, బత్తిన లక్ష్మణ శేఖర్, మురళి, రమేష్, శ్రీనివాసులు, శ్రీనివాసులు పాల్గొన్నారు.
వేమిరెడ్డి దంపతులు గిరిజన ద్రోహులు


