జిల్లాకు 10,444 మెట్రిక్ టన్నుల యూరియా
దిగుమతిని పరిశీలిస్తున్న సత్యవాణి
నెల్లూరు(పొగతోట): జిల్లాకు 10,444 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి తెలిపారు. పడుగుపాడు ర్యాక్ పాయింట్‌లో యూరియా దిగుమతిని గురువారం పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడారు. ఈ నెల్లో 23,577 మెట్రిక్ టన్నులకు గానూ 10,444 మేర వచ్చిందని చెప్పారు. మరో రెండు, మూడు రోజుల్లో 11 వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రానుందని వెల్లడించారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.


