డోంట్‌ టాక్‌.. నేను చెప్పేది విను..! | - | Sakshi
Sakshi News home page

డోంట్‌ టాక్‌.. నేను చెప్పేది విను..!

Feb 1 2026 3:06 AM | Updated on Feb 1 2026 3:06 AM

డోంట్

డోంట్‌ టాక్‌.. నేను చెప్పేది విను..!

నీ జీతమెంత..?

హౌసింగ్‌ డీఈపై ఫోన్లో సోమిరెడ్డి చిందులు

మనుబోలు: డోంట్‌ టాక్‌.. ముందు నేను చెప్పేది వింటావా..?.. నీ జీతమెంత అంటూ హౌసింగ్‌ డీఈపై ఫోన్లో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చిందులేశారు. మండలంలో శనివారం నిర్వహించిన పలు కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. కొండూరుసత్రంలో కొత్త పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. తమకు కాలనీలో ఇళ్లు నిర్మించివ్వకుండా కాంట్రాక్టర్‌ మోహన్‌రెడ్డి డబ్బులు తినేశారని పలువురు లబ్ధిదారులు ఆయనతో మొరపెట్టుకున్నారు. దీంతో హౌసింగ్‌ ఏఈ శరత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఈకి ఫోన్‌ చేసి అవకతవకలపై నిలదీశారు. అధికారి సర్దిచెప్పేందుకు యత్నించగా, డోంట్‌ టాక్‌.. ముందు నేను చెప్పేది వింటావా.. నీకు నెలకు జీతమెంత.. ఏడాదికి రూ.పది లక్షలు తీసుకుంటూ ఏమి చేస్తున్నావ్‌ అంటూ చిందులేయడంతో అక్కడున్న పలువు రు ఎమ్మెల్యే తీరుపై నివ్వెరబోయారు.

గ్రూప్‌ – 1లో దుత్తలూరు

యువకుడి సత్తా

దుత్తలూరు: ఏపీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్‌ – 1 ఫలితాల్లో దుత్తలూరుకు చెందిన యువకుడు సత్తా చాటి స్టేట్‌ ట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ పోస్ట్‌కు ఎంపికయ్యారు. దుత్తలూరుకు చెందిన రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి భారతాల గంగాధర్‌, లలితమ్మ కుమారుడు ఉదయశంకర్‌ ఎంపికవ్వడంపై పలువురు అభినందనలను తెలియజేశారు.

దగదర్తి ఎఫ్‌ఏసీ

తహసీల్దార్‌కు రిమాండ్‌

నెల్లూరు(క్రైమ్‌): దగదర్తి తహసీల్దార్‌ (ఎఫ్‌ఏసీ) పాల కృష్ణకు రిమాండ్‌ను ఏసీబీ కోర్టు ఇన్‌చార్జి న్యాయమూర్తి శనివారం విధించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కృష్ణ ఇంటితో పాటు స్నేహితులు, బంధువుల నివాసాల్లో సోదాలను ఏకకాలంలో ఏసీబీ ఇన్‌చార్జి డీఎస్పీ రామకృష్ణుడు పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు శుక్రవారం నిర్వహించారు. ఇవి శనివారం సైతం కొనసాగాయి. బుచ్చిరెడ్డిపాళెంలోని బ్యాంక్‌ లాకర్లను అధికారులు పరిశీలించారు. గుర్తించి స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ సుమారు రూ.మూడు కోట్లు అని తెలుస్తోంది. సోదాల ఆనంతరం కృష్ణకు 14 రోజుల రిమాండ్‌ను నెల్లూరు ఏసీబీ కోర్టు ఇన్‌చార్జి న్యాయమూర్తి విధించారు.

అంబటి రాంబాబుపై

దాడి హేయం

నెల్లూరు రూరల్‌: మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత అంబటి రాంబాబు ఇంటిపైకి టీడీపీ గూండాలెళ్లి హత్యాయత్నం చేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో దాడిని ఖండించారు. అనంతరం ఆయన మాట్లాడారు. లోకేశ్‌ పాలనలో ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి దాడులు చేయడం సర్వసాధారణంగా మారిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. లోకేశ్‌ నియంతృత్వ పోకడలతో తమ పార్టీ నేతలపై దాడులు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. కల్తీ నెయ్యి విషయంలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ను నిలదీసేసరికి, సమాధానం చెప్పలేని స్థితిలో, డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగా దాడులు జరిపారని మండిపడ్డారు. రాంబాబును తీవ్ర పదజాలంతో దూషిస్తూ కర్రలు, రాడ్లతో దాడి చేశారని, ఆయన చంద్రబాబును ఏమీ అనకపోయినా కావాలనే దాడి చేశారన్నారు. ఆయన్ను అరెస్ట్‌ చేసి జైలుకు పంపేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని మండిపడ్డారు. అంబేడ్కర్‌ రూపొందించిన రాజ్యాంగం అమలు కావడం లేదని, రాష్ట్రంలో నారా వారి రెడ్‌బుక్‌ పాలన సాగుతోందని దుయ్యబట్టారు. మాజీ మంత్రికే రక్షణను డీజీపీ కల్పించలేకపోతే, సామాన్యుల పరిస్థితేమిటో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరల్లోనే ఉన్నాయని స్పష్టం చేశారు.

డోంట్‌ టాక్‌..  నేను చెప్పేది విను..!
1
1/1

డోంట్‌ టాక్‌.. నేను చెప్పేది విను..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement