జగనన్నను మరోసారి సీఎం చేయాలి
నెల్లూరు రూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీల నిర్మాణాన్ని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి.. ప్రతి ఒక్కరూ సమర్థంగా పనిచేసి జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి సీఎంను చేయడమే లక్ష్యంగా పోరాడాలని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. నగరంలోని గాంధీనగర్‌లో గల ఆరెస్సెన్ ఫంక్షన్ హాల్లో పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సంస్థాగత నిర్మాణ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత హాజరయ్యారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడారు. నియోజకవర్గానికి ఎనిమిది వేల నుంచి పది వేల మందితో జగనన్న సైన్యాన్ని ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. 18 లక్షల మందితో ఇలా ఏర్పాటు చేయడం దేశ చరిత్రలోనే ప్రథమమని చెప్పారు. మండలాల వారీగా సమావేశాలను నిర్వహించి విధివిధానాలను ఖరారు చేయనున్నామని ప్రకటించారు.
అన్ని వర్గాలను దగా చేస్తున్న సర్కార్
మహిళలు.. రైతులు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలా అన్ని వర్గాలను ప్రభుత్వం దగా చేసిందని కాకాణి ఆరోపించారు. చంద్రబాబును నమ్మే స్థితిలో ఎవరూ లేరని పేర్కొన్నారు. కొన్ని పత్రికలు, చానళ్లు కనికట్టు చేస్తూ ప్రజలను నమ్మించేందుకు యత్నిస్తున్నాయని విమర్శించారు. మోసం చేయడంలో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో చంద్రబాబు ఉంటారని ఎద్దేవా చేశారు. ప్రజల కోసం ఈ రాష్ట్రంలో ఆలోచించిన వ్యక్తులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్, గత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని గుర్తుచేశారు. అధికారంలో లేకపోయినా, ఈ రోజు గ్రామాల్లో తలెత్తుకొని తిరుగుతున్నామంటే అది ప్రజలకు జగన్‌మోహన్‌రెడ్డి చేసిన మేలేనన్నారు. రాష్ట్రంలో మద్యం మాఫియా విచ్చలవిడిగా సాగుతోందని ఆరోపించారు. బెల్టు షాపులను ఏర్పాటు చేసి వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇంటింటికీ డోర్ డెలివరీ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం పోవాలని కూటమి నేతలే కోరుకుంటున్నాని చెప్పారు. ఇతరులు చేసిన పనులను కాపీ కొట్టి తానే చేశానని చెప్పుకోవడంలో పెద్ద విజనరీ బాబు అని ఎద్దేవా చేశారు. పింఛన్లలివ్వడం మినహా ఆయన చేసిందేమీలేదని విమర్శించారు. పార్టీ కష్టకాలంలో ఉన్న ప్పుడు ఆదరించిన వారందర్నీ గుర్తుపెట్టుకుంటామన్నా రు. జగనన్న సైన్యంలో ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులను అందజేస్తామని వెల్లడించారు.
సముచిత స్థానం
పార్టీలో గ్రామ, మండల, వార్డు స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి సంస్థాగత నిర్మాణానికి చర్యలు చేపట్టామని చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. కమిటీల్లో పనిచేసే శ్రేణులకు సముచిత స్థానం, గౌరవం దక్కేలా జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు చేపట్టనున్నారని వెల్లడించారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ తమ పార్టీ అధికారంలోకి వచ్చాక సముచిత స్థానాన్ని కల్పించనున్నారని చెప్పారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై బూటకపు కేసును టీడీపీ ప్రభుత్వం బనాయించినా, ఆయనెంతో ధైర్యంగా ఎదుర్కొన్నారని చెప్పారు. అధికార పార్టీ పెట్టే ఎన్ని కష్టాలనైనా తలొగ్గి ఎదుర్కొని నిలిచే శక్తిని కార్యకర్తలకు ఆయన అందించారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది స్థానాలను గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఎంతో కాలం ఉండదు
● ప్రస్తుత ప్రభుత్వం ఎంతో కాలం ఉండదని గురుమూర్తి చెప్పారు. దాడులు, దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని, అక్రమ కేసులను బనా యించి ప్రజల గొంతును అణగదొక్కేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. గ్రామ కమిటీల నుంచి కార్యకర్తలు వీటిని ఎదుర్కొని పోరాడాలని పిలుపునిచ్చారు.
● అంతులేని అవినీతికి ప్రభుత్వం పాల్పడుతోందని రఘునాథరెడ్డి ఆరోపించారు. అక్రమ కేసులు బనాయించి పైశాచికానందాన్ని పొందుతోందని ధ్వజమెత్తారు.
● తన తండ్రిపై అక్రమ కేసులను బనాయించి జైలుకు పంపిన రోజు కుటుంబానికి అండగా నిలిచింది సర్వేపల్లి ప్రజలేనని పూజిత పేర్కొన్నారు. సహోదరిగా తనకెంతో ధైర్యాన్ని జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చారని చెప్పారు. మహిళలకు సంబంధించిన ఒక్క హామీనైనా ప్రభుత్వం అమలు చేసిందానని ప్రశ్నించారు. మహిళలపై దాడులు ఎక్కువవుతున్నాయని మండిపడ్డారు.
శ్రేణులు సైనికుల్లా
పనిచేయాలి
ప్రభుత్వ తీరుపై గుర్రుగా టీడీపీ నేతలు
గ్రామ కమిటీలే నిర్ణయాత్మక శక్తులు
18 లక్షల మందితో జగనన్న సైన్యం
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి
జగనన్నను మరోసారి సీఎం చేయాలి


