అన్నీ వెతలే.. | - | Sakshi
Sakshi News home page

అన్నీ వెతలే..

Jan 24 2026 8:48 AM | Updated on Jan 24 2026 8:48 AM

అన్నీ

అన్నీ వెతలే..

● పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో సరిపడా గదులు, వసతులు, మౌలిక సదుపాయాల్లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ● వివిధ పాఠశాలల్లో 554 మరుగుదొడ్లకు తలుపులను బిగించకపోవడంతో అవి వినియోగంలోకి రాలేదు. మరో 20 నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నాయి. ● 229 కిచెన్‌ షెడ్లకు తలుపులను ఏర్పాటు చేయాల్సి ఉండగా, నిధుల్లేక 24 నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయాయి. ● జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో 485 అదనపు తరగతి గదుల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. ● 229 స్కూళ్లలో ఇంగ్లిష్‌ ల్యాబ్‌ల నిర్మాణాల పరిస్థితీ ఇంతే కావడం గమనార్హం. 26 అంగన్‌వాడీ బిల్డింగ్‌ల నిర్మాణాలు పూర్తే కాలేదు. ● అధిక శాతం స్కూళ్లలో మైనర్‌ రిపేర్లున్నాయి. ఆర్వో ప్లాంట్లు అధిక సంఖ్యలో పనిచేయకపోయినా పట్టించుకునే నాథుడే కరువవుతున్నారు. మరమ్మతులకు సైతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో అధికారులు సైతం చేతులెత్తేశారు.

గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రజల సంక్షేమమే పరమావధిగా నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అమలు చేశారు. ఇందులో భాగంగా నాడు – నేడు కార్యక్రమం కింద సర్కారీ స్కూళ్లను సమగ్రంగా అభివృద్ధి చేసి.. పేద విద్యార్థులకు కార్పొరేట్‌ తరహాలో బోధనను అందించాలని సంకల్పించారు. మొదటి విడతను పక్కాగా పూర్తి చేసి.. రెండో విడతను ప్రారంభించి నిధులనూ విడుదల చేశారు. ఈ తరుణంలో 2024లో ఎన్నికలు రావడం.. అందులో టీడీపీ విజయం సాధించాక తమ మార్కు రాజకీయాలకు సీఎం చంద్రబాబు పదునుపెట్టి దీనికి నిధులను విడుదల చేయకుండా మీనమేషాలను లెక్కిస్తున్నారు. కార్పొరేట్‌ శక్తులకు లబ్ధి చేకూర్చేందుకే ఆయన ఇలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

అన్నీ వెతలే.. 
1
1/1

అన్నీ వెతలే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement