స్థిరాస్తి రిజిస్ట్రేషన్లపై బాదుడు
నెల్లూరు సిటీ: టీడీపీ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి ప్రజలపై ఏదో రకంగా భారాన్ని మోపుతూనే ఉంది. తాజాగా వీరి కన్ను మార్కెట్ వాల్యూపై పడింది. గతేడాది ఈ రకంగా 50 శాతం వరకు ప్రభుత్వం పెంచిన విషయం విదితమే. ఈ క్రమంలో ఆదివారం నుంచి దీన్ని మరో పది శాతానికి పెంచారు. దీనికి సంబంధించిన ఆమోదానికి గానూ రిజిస్ట్రేషన్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని కలెక్టర్ హిమాన్షు శుక్లా శనివారం నిర్వహించారు.
ఏడాది తిరగకముందే..
జిల్లాలో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. నగరంలో ప్రధాన రిజిస్ట్రేషన్, స్టోన్‌హౌస్‌పేట, బుజబుజనెల్లూరు రిజిస్ట్రార్ ఆఫీసులు ఉన్నాయి. జిల్లాలోని అన్ని కార్యాలయాల పరిధిలోని ప్రాంతాలతో పాటు నగరంలో పది శాతం మేర పెంచు తూ నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా ఏడాది తిరగకముందే ప్రజలపై 60 శాతం మేర భారం పడింది.
రియల్ ఎస్టేట్‌పై తీవ్ర ప్రభావం
ఇప్పటికే జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి ప్లాట్ల కొనుగోళ్లు, విక్రయాల్లేక రియల్టర్లు లబోదిబోమంటున్నారు. వెంచర్లు, ఇళ్లను నిర్మించిన బిల్డర్లు ఆర్థికంగా కుదేలయ్యారు. ఈ రంగంలో ఏ మాత్రం కదలికలేని పరిస్థితుల్లో పది శాతాన్ని పెంచడం వీరి పాలిట అశనిపాతంలా పరిణమించనుంది.
ఒక్క రోజులో 518 రిజిస్ట్రేషన్లు
జిల్లాలోని 15 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 518 రిజిస్ట్రేషన్లు జరిగాయి. కార్యాలయాలు శనివారం కిటకిటలాడాయి. రూ.2.87 కోట్ల ఆదాయమొచ్చింది.
కార్యాలయాలు రిజిస్ట్రేషన్ల
సంఖ్య
నెల్లూరు ఆర్‌ఓ 72
స్టోన్‌హౌస్‌పేట 56
బుజబుజనెల్లూరు 18
కందుకూరు 40
అల్లూరు 23
ఆత్మకూరు 38
బుచ్చిరెడ్డిపాళెం 40
మార్కెట్ విలువ పది శాతం పెంపు
నేటి నుంచి అమల్లోకి
గతేడాది ఫిబ్రవరి ఒకటిన
50 పర్సంట్ మోత
ఈ సంవత్సరమూ అదే పంథా
స్థిరాస్తి రిజిస్ట్రేషన్లపై బాదుడు


