మెడికల్‌ కాలేజీకి భౌతికకాయం దానం | - | Sakshi
Sakshi News home page

మెడికల్‌ కాలేజీకి భౌతికకాయం దానం

Feb 6 2026 7:21 AM | Updated on Feb 6 2026 7:21 AM

మెడిక

మెడికల్‌ కాలేజీకి భౌతికకాయం దానం

నెల్లూరు(అర్బన్‌): జిల్లాలో ఎస్‌ఎఫ్‌ఐ ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన జానా వెంకయ్య (78) బుధవారం మృతిచెందారు. సింహపురి దేహ సమర్పణ సంస్థ కన్వీనర్‌ పి.విజయమ్మ అభ్యర్థన మేరకు ఆయన భౌతికకాయాన్ని కుమారుడు డా.చైతన్య కిశోర్‌, కుమార్తె స్రవంతి నగరంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు దానం చేశారు. జానా వెంకయ్య ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో పనిచేస్తూ చాలాకాలం క్రితం స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేశారు. ఆయన మరణించే వరకు సీపీఎంలో పని చేశారు. ఆయన మృతిపట్ల మాజీ డిప్యూటీ మేయర్‌ మాదాల వెంకటేశ్వర్లు, రామచంద్రారెడ్డి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజేశ్వరరావు, ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఎంవీ రమణయ్య, సీనియర్‌ డాక్టర్‌ దత్తాత్రేయులు తదితరులు సంతాపం తెలిపారు.

ప్రధానమంత్రి

ఫొటో ఎందుకు పెట్టలేదు

ప్రశ్నించిన బీజేపీ నేతలు

వాకాడు: మండలంలోని వాకాడులో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్‌ కార్యక్రమంలో బ్యానర్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటో లేకపోవడంపై బుధవారం జేసీ గోవిందరావును బీజేపీ నాయకులు ప్రశ్నించారు. తిరుపతి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు పాపారెడ్డి పురుషోత్తంరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పనబాక కోటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేస్తూ ప్రధాని ఫొటో లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ అహర్నిశలు కష్టపడినట్లు చెప్పారు. ప్రతి పనికి రెవెన్యూ అధికారులు పేద ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకొంటూ అన్యాయం చేస్తున్నారన్నారు. వారికి న్యాయం జరగకపోతే తహసీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

కండలేరులో

58.440 టీఎంసీలు

రాపూరు: కండలేరు జలాశయంలో బుధవారం నాటికి 58.440 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 300 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,400, లోలెవల్‌ కాలువకు 200, హైలెవల్‌ కాలువకు 175, పిన్నేరు కాలువకు 50, మొదటి బ్రాంచ్‌ కాలువకు 85 క్యూసె క్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

మెడికల్‌ కాలేజీకి భౌతికకాయం దానం1
1/3

మెడికల్‌ కాలేజీకి భౌతికకాయం దానం

మెడికల్‌ కాలేజీకి భౌతికకాయం దానం2
2/3

మెడికల్‌ కాలేజీకి భౌతికకాయం దానం

మెడికల్‌ కాలేజీకి భౌతికకాయం దానం3
3/3

మెడికల్‌ కాలేజీకి భౌతికకాయం దానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement