మంచి నడవడికతో ఉన్నత శిఖరాలకు | - | Sakshi
Sakshi News home page

మంచి నడవడికతో ఉన్నత శిఖరాలకు

Apr 4 2026 7:25 AM | Updated on Apr 4 2026 7:25 AM

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

బిట్రగుంట: పుస్తక పరిజ్ఞానం, సృజనాత్మక ధోరణితో పాటు మంచి అలవాట్లను పెంపొందించుకుంటే లక్ష్యాలను విద్యార్థులు సులువుగా చేరుకోవచ్చని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. కడనూతలలోని రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల 18వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా శుక్రవారం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా కాకాణి, జేఎన్టీయూ (అనంతపురం) అకడమిక్‌ అండ్‌ ఆడిట్‌ డైరెక్టర్‌ దుర్గాప్రసాద్‌, కళాశాల వ్యవస్థాపకుడు, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కాకాణి మాట్లాడారు. లక్ష్యాలను విద్యార్థులు నిర్దేశించుకొని కలలను సాకారం చేసుకునేందుకు కృషి చేయాలని సూచించారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న అలవాట్లు, ఆకర్షణలకు దూరంగా ఉండాలని చెప్పారు. అనంతరం దుర్గాప్రసాద్‌ మాట్లాడారు. ప్రస్తుత విద్యా, ఉద్యోగ రంగాల్లో వస్తున్న మార్పులు, వాటికి అనుగుణంగా విద్యార్థులు పెంపొందించుకోవాల్సిన నైపుణ్యాలపై అవగాహన కలిగించారు. గ్రామీణ విద్యార్థులకు అత్యుత్తమైన బోధనను అందించాలనే లక్ష్యంతో కడనూతలలో అన్ని సదుపాయాలతో కళాశాలను నిర్మించామని ప్రతాప్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆధునిక సాంకేతిక అంశాలు, సంస్థలకు అవసరమైన నైపు ణ్యాలపై ఎప్పటికప్పుడు శిక్షణనిస్తుండటంతో క్యాంపస్‌ ఎంపిల్లో విద్యార్థులు రాణిస్తున్నారని వివరించారు. కళాశాల డైరెక్టర్‌ రాజారెడ్డి, ప్రిన్సిపల్‌ పీవీఎన్‌ రెడ్డి, ఏఓ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement