నైపుణ్యాలతో అంతర్జాతీయ అవకాశాలు
● వీసీ అల్లం శ్రీనివాసరావు
వెంకటాచలం(పొదలకూరు): నైపుణ్యాలతో యువతకు అంతర్జాతీయ అవకాశాలు వస్తున్నాయని, డిజిటల్ యుగంలో డేటా విశ్లేషణ, విజువలైజేషన్ నైపుణ్యాలు పారిశ్రామిక రంగాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాయని విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ఉపకులపతి అల్లం శ్రీనివాసరావు అన్నారు. కాకుటూరులోని వీఎస్‌యూ ప్రాంగణంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టూరిజం మేనేజ్‌మెంట్, స్టాటిస్టిక్స్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో వారం రోజులపాటు నిర్వహించిన జాతీయ స్థాయి వర్క్‌షాప్ శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విద్యార్థులు, పరిశోధకులు కేవలం పుస్తక విజ్ఞానానికే పరిమితం కాకుండా ప్రోగ్రామింగ్, ఆధునిక సాఫ్ట్‌వేర్లపై పట్టు సాధించాలన్నారు. రిసోర్స్ పర్సన్‌గా ఢిల్లీ టెక్నాలాజికల్ యూనివర్సిటీ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ రుచికా మల్హోత్రా వ్యవహరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత తదితరులు పాల్గొన్నారు.


