లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘కేంద్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి తూట్లు పొడిచి కార్పొరేట్ శక్తులకు అండగా నిలుస్తోంది. నూతనంగా ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్స్‌ను వెంటనే రద్దుచేయాలి’ అని సీఐటీయూ నాయకులు అజయ్‌కుమార్, నాగేశ్వరావు, సీపీఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. నెల్లూరులోని డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన భవన్‌లో శుక్రవారం ‘లేబర్ కోడ్స్ – కార్మికులపై ప్రభావం’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ కార్మికులు సృష్టిస్తున్న సంపద కార్పొరేట్ శక్తుల ఖజానాకు పోతుందన్నారు. పంటలకు గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడిపోతున్నారన్నారు. వచ్చే నెల 12వ తేదీ చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరారు.


