చికెన్‌ వ్యర్థాల వాహనం సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

చికెన్‌ వ్యర్థాల వాహనం సీజ్‌

Feb 6 2026 7:30 AM | Updated on Feb 6 2026 7:30 AM

చికెన

చికెన్‌ వ్యర్థాల వాహనం సీజ్‌

పొదలకూరు: తిరుపతి నుంచి పొదలకూరు మీదుగా సంగం వెళ్తున్న చికెన్‌ వ్యర్థాల వాహనాన్ని పొదలకూరు పోలీసులు గురువారం సీజ్‌ చేశారు. ఎస్సై హనీఫ్‌ కథనం మేరకు.. కోళ్ల వ్యర్థాలను సంగంలోని చేపల పెంపకానికి మేతగా వినియోగించేందుకు తీసుకెళ్తున్నట్లు నిందితులు వెల్లడించారు. ఈ మేరకు డ్రైవర్లుగా ఉన్న పడారుపల్లికి చెందిన మల్లి కృష్ణ, విడవలూరుకు చెందిన కంద్రాటి రవిప్రసాద్‌పై కేసు నమోదు చేశారు. వ్యర్థాలను ఊరికి దూరంగా తీసుకెళ్లి పాతిపెట్టారు.

బైక్‌పై నుంచి పడి

మహిళ మృతి

చేజర్ల: తన కుమారుడి బైక్‌పై వెళ్తూ జారిపడి మహిళ మృతిచెందిన ఘటన గురువారం చేజర్ల మండలం ఆదూరుపల్లి గ్రామదేవత ఆలయ సమీపంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామానికి చెందిన లక్ష్మమ్మ (55) ఆమె కుమారుడు శ్రీకాంత్‌తో కలిసి కలువాయి మండలంలో జరిగే బంధువుల ఉత్తరక్రియలకు బైక్‌పై బయలుదేరారు. ఆదూరుపల్లి వద్ద వెనుక కూర్చుని ఉన్న లక్ష్మమ్మ తన తలకు గుడ్డ చుట్టుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు జారి రోడ్డుపై పడిపోయింది. అక్కడికక్కడే ఆమె మృతి చెందడంతో కుమారుడు తీవ్రంగా రోధిస్తుండడం ఆ దారిలో వెళ్లేవారిని కలచివేసింది. కొందరు వాహన చోదకులు శ్రీకాంత్‌ను ఓదార్చారు. చేజర్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నిమ్మధరలు(కిలోల్లో)

పెద్దవి: రూ. 50

సన్నవి: రూ. 30

పండ్లు: రూ. 20

చికెన్‌ వ్యర్థాల వాహనం సీజ్‌ 1
1/2

చికెన్‌ వ్యర్థాల వాహనం సీజ్‌

చికెన్‌ వ్యర్థాల వాహనం సీజ్‌ 2
2/2

చికెన్‌ వ్యర్థాల వాహనం సీజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement