ఫీజు చెల్లింపునకు 12 వరకు అవకాశం | - | Sakshi
Sakshi News home page

ఫీజు చెల్లింపునకు 12 వరకు అవకాశం

Feb 6 2026 7:30 AM | Updated on Feb 6 2026 7:30 AM

ఫీజు

ఫీజు చెల్లింపునకు 12 వరకు అవకాశం

నెల్లూరు (టౌన్‌): పదో తరగతి పరీక్షలకు సంబంధించిన ఫీజును చెల్లించేందుకు ఈ నెల 12 వరకు గడువుందని డీఈఓ బాలాజీరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తత్కాల్‌ ఫీజు కింద రూ.వెయ్యి, అపరాధ రుసుమును చెల్లించాలని కోరారు. అదే తేదీలోపు అన్ని డాక్యుమెంట్లతో నామినల్‌ రోల్స్‌ను ఆన్‌లైన్లో సమర్పించాలని సూచించారు. వివరాలకు bse.ap.gov.in లేదా దర్గామిట్టలోని జెడ్పీ స్కూల్లో గల జిల్లా పరీక్షల విభాగాన్ని సంప్రదించాలని పేర్కొన్నారు.

పట్టుబడిన ఎర్రచందనం

దుంగల అప్పగింత

ఉదయగిరి: మండలంలోని ఆర్లపడియ అటవీ ప్రాంతంలో గత నెల 18న పోలీసులు స్వాధీ నం చేనుకున్న ఎర్రచందనం దుంగలు, వాహనాన్ని అటవీ శాఖ అధికారులకు గురువారం అప్పగించారు. 30 దుంగలు, వాహనాన్ని అప్పగించామని ఎస్సై ఇంద్రసేనారెడ్డి తెలిపారు.

కలెక్టరేట్లో 20న

ఎంప్లాయీస్‌ గ్రీవెన్స్‌

నెల్లూరు(దర్గామిట్ట): కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఎంప్లాయీస్‌ గ్రీవెన్స్‌ను ఈ నెల 20న నిర్వహించనున్నామని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఏపీ జేఏసీ అమరావతి

కార్యదర్శిగా చంద్రశేఖర్‌

నెల్లూరు(క్రైమ్‌): ఏపీ జేఏసీ అమరావతి కార్యదర్శిగా ఏపీ స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ జేఏసీ అమరావతి కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. ఇందులో కార్యదర్శిగా జిల్లాకు చెందిన చంద్రశేఖర్‌ ఎన్నికయ్యారు. ఆయనకు పలువురు అభినందనలను తెలియజేశారు.

మూడు నెలల

పసికందు మృతి

వ్యాక్సిన్‌ వికటించి

మృతి చెందిందంటున్న బంధువులు

దుత్తలూరు: మూడు నెలల పసికందు మృతి చెందిన ఘటన మండలంలోని భైరవరం ఎస్సీ కాలనీలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వ్యాక్సిన్‌ వికటించడంతోనే తమ బిడ్డ మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. వివరాలు.. భైరవరం ఎస్సీ కాలనీకి చెందిన చాట్ల లక్ష్మీదేవి మూడు నెలల క్రితం పాపకు జన్మనిచ్చారు. నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలలో ప్రసవం జరిగింది. స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహిస్తుండటంతో చిన్నారికి పోలియో వ్యాక్సిన్‌ను ఏఎన్‌ఎం వేశారు. రాత్రి సమయంలో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో 108కు సమాచారం అందించారు. ఊపిరాడటంలేదని, వెంటనే వైద్యశాలకు తరలించాలని కోరగా, పరిశీలించిన సిబ్బంది అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారు. సమాచారం అందుకున్న దుత్తలూరు వైద్యాధికారి అయూబ్‌ అఫ్సర్‌ సిబ్బందితో కలిసి గ్రామానికి గురువారం వెళ్లి చిన్నారిని పరీక్షించారు. వ్యాక్సిన్‌ వికటిస్తే గంటన్నర్లోనే ప్రభావం ఉంటుందని, ఇది కారణం కాదని తెలిపారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వారు సైతం ఇదే విషయాన్ని తేల్చారు. తమ బిడ్డ మరణానికి వ్యాక్సినే కారణమంటూ దుత్తలూరు పోలీసులకు చిన్నారి తల్లి ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి ఎస్సై ఆదిలక్ష్మి వెళ్లి చిన్నారి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు.

ఫీజు చెల్లింపునకు  12 వరకు అవకాశం 
1
1/2

ఫీజు చెల్లింపునకు 12 వరకు అవకాశం

ఫీజు చెల్లింపునకు  12 వరకు అవకాశం 
2
2/2

ఫీజు చెల్లింపునకు 12 వరకు అవకాశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement