లైంగికదాడికి యత్నించిన కేసులో నిందితుడి అరెస్ట్
కోట: బాలికపై లైంగికదాడికి యత్నించిన కేసులో నిందితుడు ఆటో డ్రైవర్ వెంకటేష్‌ను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు సీఐ కిశోర్‌బాబు గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ తిన్నెలపూడికి వెంకటేష్ ఇటీవల ఓ బాలికను ఆటోలో ఎక్కించుకుని మండలంలోని కేసవరం అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించాడన్నారు. కేసు నమోదు చేసి విచారణ జరిపామన్నారు. మైక్రో టవర్ కాలనీ వద్ద వెంకటేష్‌ను అరెస్ట్ చేసి ఆటోను సీజ్ చేసినట్లు తెలిపారు. ఎస్సై పవన్‌కుమార్ పాల్గొన్నారు.
గ్యాస్ సిలిండర్ల స్వాధీనం
ముత్తుకూరు(పొదలకూరు): నేలటూరు పరిసర ప్రాంతంలో గ్యాస్ మాఫియా తయారైంది. అక్రమంగా వంట గ్యాస్ సిలిండర్లను నిల్వ చేసుకుంటూ తద్వారా చిన్నపాటి సిలిండర్లకు రీఫిల్లింగ్ చేస్తున్నారు. ఈ అక్రమ వ్యాపారంపై గురువారం సివిల్ సప్లయీస్, విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. చాలాకాలంగా ఈ వ్యాపారం చేస్తున్న మాఫియాను పట్టుకున్నారు. వివిధ కంపెనీల సిలిండర్లు గుర్తించారు. సుమారు రూ.1.34 లక్షల విలువైన సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
లైంగికదాడికి యత్నించిన కేసులో నిందితుడి అరెస్ట్


