నెల్లూరులో టీవీఎస్ షోరూమ్ ప్రారంభం
నెల్లూరు(టౌన్): నెల్లూరులోని మినీబైపాస్‌లో అన్నమయ్య సర్కిల్లో గురువారం టీవీఎస్ మోటార్ కంపెనీ నూతన షోరూమ్‌ను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఇన్‌చార్జి మేయర్ రూప్‌కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ తాళ్లపాక అనూరాధ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ కంపెనీ జనరల్ మేనేజర్ కేంద్రీజ్ జోషి, ఏరియా మేనేజర్ వంశీకృష్ణ, సర్వీసు మేనేజర్ రోనాల్డ్ రాబర్ట్ మాట్లాడుతూ ద్విచక్ర వాహన మోడళ్లను ప్రదర్శనలో ఉంచుతామన్నారు. ఆధునిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన సిబ్బందితో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. షోరూమ్‌ను అత్యాధునికంగా తీర్చిదిద్దారన్నారు. నెల్లూరు, పరిసర ప్రాంతాల్లో టీవీఎస్‌కు ఉన్న ఆదరణను బలోపేతం చేయడంతోపాటు నాణ్యమైన ఉత్పత్తులతో వినియోగదారుల్లో నమ్మకాన్ని మరింత పెంచడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో డీలర్లు సాయిమోహన్‌రెడ్డి, నిఖిత్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
నెల్లూరులో టీవీఎస్ షోరూమ్ ప్రారంభం


